తల్లికి వందనం 13000 జూలై 22న ఖాతాలో జమ కావాలంటే.. ఈ విద్యార్థికి బ్యాంకు ఖాతా తెరవండి.. వివరాలు ఇవే
AP Talliki Vandanam Scheme 2026 release important update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 22న (బుధవారం) తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులకు ఇంకా బ్యాంక్ అకౌంట్ ప్రారంభం లేదని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారిక అధికారి బి.జోతి లక్ష్మీదేవి గారు ప్రకటించారు. ఎస్సీ ఇంటర్ మొదటి విద్యార్థులు మీరు వెంటనే బ్యాంకు ఖాతా తెరిచి వాటిని NPCI అనుసంధానం చేయాలని ఆమె సూచించారు. లేదా సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకులో 200 రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చు. ఖాతా తెరవడానికి ఆధార్ కార్డు, ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నెంబరు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మార్క్ షీట్ అవసరం ఉన్నాయి. అలాగే ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ సమాచారాన్ని ఎస్సీ విద్యార్థులకు చేరవేసి ఖాతా ప్రారంభించాలని సహకరించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లో 47,550 మందికి గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో పనిచేసే అంగన్వాడీలకు తల్లికి వందనం వర్తిస్తాయని ఇతరులు జారీ చేశారు. దీంతో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే వారి పిల్లలకు రూ.13,000/- చొప్పున కూటమి ప్రభుత్వం అందచేస్తున్నారు. ఈ స్కీం రూల్స్ ప్రకారం గ్రామాలలో నెల ఆదాయం 10,000 మించకూడదు. అంగన్వాడీ టీచర్లకు 11,500 ఉండడంతో వీళ్లకు ఈ పథకం అందలేదు. అంగన్వాడి సహాయకకు మెనీ అంగన్వాడీ టీచర్ కు ఈ పథకం అందడం జరిగింది.
ఈనెల 22న తల్లికి వందనం 2026-27 విద్యా సంవత్సరంలో 64.76 లక్షల మంది విద్యార్థులు నిధులు విడుదల జారీ చేసిన ప్రభుత్వం. ఈ పథకం కింద 10,120.78 కోట్ల జమ చేస్తున్నట్లు వివరించారు. ఈ స్కీం కింద ఒక్కొక్క విద్యార్థికి 13 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో డైరెక్ట్ గా డబ్బులు జమ కానున్నాయి.
•సచివాలయాలలో జూలై 22న అర్హత, అనార్హత జాబితా ప్రదర్శన చేస్తారు.
•సచివాలయంలో ఈనెల 22 నుంచి ఆగస్టు 03 వరకు అభ్యంతరాలు ఫిర్యాదులను స్వీకరిస్తారు.
•అలాగే ఆగస్టు 4 నుంచి 10 వరకు ఫిర్యాదుల స్వీకరణ, అదనపు అర్హత జాబితా రూపు కల్పన చేస్తారు.
•1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ కొత్త ప్రవేశాలకు చివరి తేదీ ఆగస్టు 25 వరకు ముగిస్తుంది.

•ఇవన్నీ పూర్తయ్యాక సచివాలయాల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అదనపు అర్హత జాబితా నమోదు ఫిర్యాదు వివరాలను ప్రచురిస్తారు అలానే ఆగస్టు 30న ఆర్థిక సహాయం పంపిణీ చేస్తారు.

