ఆ రోజున తల్లికి వందనం ఫైనల్ డేట్ ఫిక్స్.. వీరికి మాత్రమే రూ.13వేలు జమ..  రావాలంటే.. ఇలా చేయండి : Talliki Vandanam Scheme 2026

ఆ రోజున తల్లికి వందనం ఫైనల్ డేట్ ఫిక్స్.. వీరికి మాత్రమే రూ.13వేలు జమ..  రావాలంటే.. ఇలా చేయండి : Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme New Release Date 2026 :ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి 2026-27 విద్య సంవత్సరానికి ₹13,000 చొప్పున తల్లుల ఖాతాలో డైరెక్ట్ జమ చేస్తారు. ఇది 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు అందరికీ వస్తుంది. ఈనెల 22వ తేదీన తల్లికి వందనం నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి దాదాపుగా 17 వేల మంది అంగన్వాడీ కార్యకర్త (1వ తరగతి నుంచి ఇంటర్ వరకు) పిల్లలకు కూడా ఈ స్కీం వర్తిస్తుందని తెలిపారు. అలాగే శనిటైజేషన్ వర్కర్ పిల్లలు కూడా అందిస్తామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 67.47 లక్షల మంది విద్యార్థులు అర్హులని తెలిపారు. మొత్తం బడ్జెట్ ₹10,120.78 కోట్లు మంజూరు చేసింది. కొత్తగా 1వ తరగతి మరియు ఇంటర్‌లో చేరే విద్యార్థులు 25-08-2026 వరకు అడ్మిషన్ పూర్తి చేస్తే ఈ పథకానికి అర్హులు. అర్హులైన ఒక్కొక్క విద్యార్థికి 2,000/- చొప్పున మినహాయించి మిగతా 13,000 జమ చేయనున్నారు.

అలాగే 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థులు తమ పేరుతో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎస్సీ విద్యార్థి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. NPCI లింకింగ్ పూర్తి చేయాలి. ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంకు (IPPB) ద్వారా సులభంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు ఆధార్, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, తేదీ ధ్రువీకరణ పత్రం/10వ తరగతి మెమో, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్. అకౌంట్ లేకపోతే తల్లికి వందనం పథకం ప్రయోజనం కోల్పోయే అవకాశం ఉంది. వెంటనే బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేసి NPCI సీడింగ్ పూర్తి చేసుకోండి.

తల్లికి వందనం నిధులు ముఖ్యమైన తేదీలు

*22 జులై 2026 – 64,76,590 అర్హుల జాబితా విడుదల & మొదటి విడత నగదు జమ.

*22 జులై 2026 – సచివాలయంలో అర్హతలు అనర్హుల జాబితా ప్రదర్శన

*22 జులై 2026 నుంచి 03 ఆగష్టు 2026 వరకు -అభ్యంతరాలు / ఫిర్యాదులు స్వీకరణ.

*04 ఆగష్టు 2026 నుంచి 10 ఆగష్టు 2026 వరకు – ఫిర్యాదుల పరిశీలన, అదనపు అర్హుల జాబితా తయారీ.

*25 ఆగష్టు 2026 – 1st క్లాస్ to ఇంటర్ కొత్త అడ్మిషన్లకు చివరి తేదీ

*30 ఆగష్టు 2026 – అదనపు అర్హుల జాబితా విడుదల మరియు రెండో విడత చెల్లింపులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్స్ ఈనెల 24న జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం ఉంటుంది. అలాగే సీఎం చంద్రబాబు గారు మంత్రి లోకేష్ గారు రాంపచోడవరంలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి హాజరుకానున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి.. ఇప్పుడు వరకు తల్లి యొక్క ఆధార్ కార్డు తో బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే e-KYC తప్పనిసరిగా చేయండి. NPCI మ్యాపింగ్ అయి ఉండాలి అప్పుడే తల్లికి వందనం డబ్బులు పడతాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *