Tirumala October Darshanam Quota Release : అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం, గదుల బుకింగ్ కోటా వివరాలు విడుదలయ్యాయి
Tirumala October Darshanam Quota Release details : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అక్టోబర్ నెల కు సంబంధించి వివిధ దర్శనాల మరియు గదులకోట వివరాలు విడుదల చేశారు.

•జూలై 18వ తేదీన 10 గంటలకు – తిరుమల శ్రీవారి అర్చన సేవా టికెట్లు (సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన సేవ) టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు.
•జూలై 20వ తేదీన ఉదయం 10 గంటలకు -ఈ సేవా టికెట్ ఎలక్ట్రానికల్ డీప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి.
•జూలై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లో సొమ్ము చెల్లించే వారికి టికెట్ మంజూరు.
•జూలై 21వ తేదీన ఉదయం 10 గంటలకు – కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ కోసం ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు.
• జూలై 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు – వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లు ఆన్లైన్లో టీడీడీ విడుదల చేస్తున్నారు.
• జూలై 23వ తేదీన ఉదయం 10 గంటలకు – అంగ ప్రదక్షిణ టోకెన్లు కోటాను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు.
•జూలై 23వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం కోసం టీడీడీ ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు.
•జూలై 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టిటిడి ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు.
• జూలై 24వ తేదీన ఉదయం 10 గంటలకు టిటిడి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కోటా విడుదల చేస్తున్నారు.
• జూలై 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలలో గదలకోట ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం, మరియు బుకింగ్ కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ని సంప్రదించండి.


