RRB Group D Exam Date 2026 Out : రైల్వే గ్రూప్ డి CEN 09/ 2025 CBT పరీక్షా షెడ్యూల్ విడుదల

RRB Group D Exam Date 2026 Out : రైల్వే గ్రూప్ డి CEN 09/ 2025 CBT పరీక్షా షెడ్యూల్ విడుదల

RRB Group D Exam Date 2026 Out : రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ అధికార వెబ్సైట్లో రైల్వే గ్రూప్ డి పరీక్ష షెడ్యూల్ 2026 అధికారికంగా ప్రకటన చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం RRB గ్రూప్ డి CEN 09/2025 CBT పరీక్షలు 03 ఆగస్టు నుంచి 21 ఆగస్టు వరకు మూడు షిఫ్టులలో (ఉదయం మధ్యాహ్నం & సాయంత్రం) నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 22,195 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. పరీక్ష నగరం మరియు తేదీని చూసేందుకు, అలాగే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల ప్రయాణ అనుమతి పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు సంబంధించిన లింక్, పరీక్ష తేదీకి సుమారు 10 రోజుల ముందు అన్ని ఆర్ఆర్‌బిల అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఈ-కాల్ లెటర్స్, అడ్మిట్ కార్డులను 4 రోజుల ముందు రిలీజ్ చేస్తామని పేర్కొంది. ఎగ్జామ్ సెంటర్స్ వద్ద ఆధార్ UIDAI బయోమెట్రిక్ అథెంటికేషన్ జరుగుతుందని, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించింది.

RRB గ్రూప్ డి 22,195 పోస్టులు పరీక్షలు 2026-27 ఆగస్టు 3 నా ప్రారంభమై, ఆగస్టు 21 వరకు మూడు షిఫ్ట్ లలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కొనసాగుతుంది. విద్యార్థులు పరీక్షా షెడ్యూలు షిప్స్ సమయము పరీక్ష మరియు నగరం అడ్మిట్ కార్డు గురించి సమాచారం వంటి ముఖ్య వివరాలను అధికార వెబ్సైట్లో మాత్రమే చూడాలి. పరీక్ష కన్నా ముందు 9 నుంచి 10 రోజులు ముందే అనగా జూలై 25వ తేదీన పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల చేస్తారు. ఆ తరువాత ఆర్ఆర్బి గ్రూప్ డి అడ్మిట్ కార్డు జూలై 31వ తేదీ నుంచి అధికార వెబ్సైట్లో rrbapply.gov.in డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ (RRB) వారి CEN 09/2025 నోటిఫికేషన్ కింద 22,195 ఉద్యోగాలకు అసిస్టెంట్, ట్రాఫిక్ మెయింటినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్ మరియు అసిస్టెంట్ టిఎల్ఎసి ఉద్యోగాల కోసం గ్రూప్ డి పరీక్షల సుమారుగా 87 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా హాలులోకి ప్రవేశించే ముందు పరీక్షా కేంద్రంలో అభ్యర్థుల ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ ధృవీకరణ జరుగుతుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును లేదా ఇ-వెరిఫైడ్ ఆధార్ ప్రింటౌట్‌ను తీసుకురావాలి. పరీక్షా కేంద్రంలోకి సులభంగా ప్రవేశించడానికి, అభ్యర్థులు ఇంతకు ముందే ధృవీకరించుకోనట్లయితే, www.rrbapply.gov.in లో తమ ఆధారాలతో లాగిన్ అయి, తమ గుర్తింపును ఆధార్ ధృవీకరణ చేసుకోవాలని సూచించడమైనది. RRB ఎంపికలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)పై ఆధారపడి ఉంటాయి మరియు నియామకాలు కేవలం అభ్యర్థుల మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతాయి.

🛑RRB Group D Exam Date 2026 Out

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *