Rythu Bharosa Scheme 2026 : రేపే రైతు భరోసా అకౌంట్లో రూ.6000/- పూర్తి వివరాలు తెలుసుకోండి

Rythu Bharosa Scheme 2026 : రేపే రైతు భరోసా అకౌంట్లో రూ.6000/- పూర్తి వివరాలు తెలుసుకోండి

Rythu Bharosa Scheme 2026 Tomorrow Release All Details In Telugu : తెలంగాణలో రైతులకు శుభవార్త. రేపే రైతు భరోసా రైతుల ఖాతాలో 6000 జమ.. వానాకాలం సీజనకు సంబంధించిన రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు 30 జూన్ మంగళవారం ఖమ్మం (D) మత్తేపల్లి సభలో విడుదల చేయనున్నారు. జూలై 15 నాటికి విడుదలవారీగా అన్నదాత అకౌంటులలో 6000 జమ చేయనన్నారు. అందుకుగాను 9,000 కోట్ల నిధులు సమీకరణ పూర్తయినట్లు సమాచారం. మరోవైపు 15 జూన్ 2026 నాటికి కొత్తగా పట్టాదారుల పాస్బుక్ పుస్తకాలు పొందిన రైతులకు జూలై 5 లోపల పెట్టుబడి సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.

కొత్తగా పట్టాదారులు పాస్బుక్ పొందిన వారు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అందుకోసం అర్హత కలిగిన అన్నదాతలు రైతు వేదిక వద్దకు కానీ వ్యవసాయం విస్తరణ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలని తెలిపారు. అందుకుగాను రైతు యొక్క ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, అకౌంటు ఫస్ట్ పేజీ జిరాక్స్, 1బీ పత్రాలు ఆన్లైన్లో తీసుకొని, రైతు భరోసా అప్లికేషన్ ఫామ్ తో పాటు అప్లికేషన్ పూర్తి వివరాలు నింపి, రైతు వేదికలలో అందుచేయాలని వ్యవసాయ అధికారులు సూచించారు. 

రైతు భరోసా పథకానికి అర్హతలు తెలంగాణ రాష్ట్రం చెందిన రైతులై ఉండాలి. రైతుకు కనీసం 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. భూమి దరఖాస్తుదారుని పేరు పైన ఉండాలి. వ్యవసాయానికి అనుకూలమైన భూమై ఉండాలి. ఆ భూమి భూభారతి పోర్టల్ లో నమోదయి ఉండాలి. అది కూడా మీ పేరు పై భూమి ఉండాలి. తప్పుడు పత్రాలు సృష్టించి పథకాన్ని పొందాలనుకునే అభ్యర్థులకు కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే సాగుకు యోగ్యం లేని భూములు బీడుభూములు, రాళ్లరప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కాలువలు, వాణిజ్య సంయోజనకు చెందిన భూములు ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కాదు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *