AP EAPCET 2026 Release : విద్యార్థులకు అలర్ట్..ఈ నెల 30న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు
AP EAPCET Results 2026 Release Date & AP EAPCET Results Direct Link : ఆంధ్రప్రదేశ్ లో లక్షలాదిమంది విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నా ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు ఈనెల 30న మంగళవారం విడుదల కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ లో ఏపీ ఈఏపీసెట్ 2026 విడుదల చేస్తారని, ఈఏపీసెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ సిఎస్ఆర్ కె ప్రసాద్ గారు ఆదివారం తెలిపారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరగగా అందులో మొత్తం 3 లక్షల 29 వేల మంది పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో MPC స్ట్రీమ్ లో 2.58 లక్షల మంది విద్యార్థులు, BiPC స్టీమ్ లో 70,929 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికి ఫలితాలు విడుదల చేయవలసి ఉండేది కానీ ఇంటర్ మార్క్స్ కు 25 వెయిటేజీ ఉండడంతో ఏపీ సెకండ్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు, సీబీఎస్సీ రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాలు పూర్తిస్థాయిలో వచ్చేవరకు ఆగడంతో ఫలితాలు ఆలస్యం అయ్యాయి.
తాజాగా సీబీఎస్సీ రి వెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల ప్రక్రియ తుది దశలోకి చేరడంతో ఈనెల 30వ తేదీన ఎంసెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ను https://cets.apsche.ap.gov.in/ విజిట్ చేయండి.

🛑AP EAPCET 2026 Release Direct Link

