No Fee : 7th అర్హతతో ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ & ఆఫీస్ సబర్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ | AP Government Polytechnic College APCOS Notification 2026 Apply Now
AP Government Polytechnic College Recruitment 2026 latest APCOS Junior Assistant, Lab Attender & Office Subordinate Jobs Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వ పాలిటెక్నిక్ లో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ & ఆఫీస్ సబార్డినేట్ అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ కొరకు ఈ క్రింది నోటిఫికేషన్ జారీ చేయబడింది. దరఖాస్తులు 08-06-2026 నుండి 20-06-2026 వరకు స్వీకరించబడతాయి.

అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆమోదం మేరకు, నార్పల లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లో అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ కొరకు ఈ క్రింది నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి. 7th, ITI/Any డిగ్రీ పాసై, 18-42 ఏళ్ల వయసున్న వారు అర్హులు. మౌలిక రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి చేసిన తమ దరఖాస్తులను ప్రత్యక్షంగా లేదా పోస్టు ద్వారా ప్రిన్సిపాల్ గారి కార్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, నార్పలకు, ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, 08-06-2026 నుండి 20-06-2026 వరకు సమర్పించాలి.
AP Government Polytechnic College APCOS Junior Assistant, Lab Attender & Office Subordinate Jobs Notification 2026 Apply 08 Vacancy Overview :
సంస్థ పేరు ::ప్రభుత్వ పాలిటెక్నిక్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ & ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 08
రిక్రూట్మెంట్ విధానం :: అవుట్ సోర్సింగ్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 42 సం||రాలు
విద్య అర్హత :: 7th, ITI & Any డిగ్రీ
నెల జీతం :: రూ.₹15,000/- to 18,500/-
దరఖాస్తు ప్రారంభం :: 08.06.2026
దరఖాస్తుచివరి తేదీ :: 20.06.2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
అధికార వెబ్సైట్ : https://ananthapuramu.ap.gov.in/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ & ఆఫీస్ సబార్డినేట్ 08 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»అవసరమైన విద్యా అర్హతలు :
•జూనియర్ అసిస్టెంట్ :: కేంద్ర చట్టం, రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుండి లేదా విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్)చే గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి.
•ల్యాబ్ అటెండర్ :: పిట్టర్, టర్నర్, మెకానిస్ట్, వెల్డర్ లేదా ఇతర తత్సమాన మెకానికల్ ట్రేడ్ల వంటి సంబంధిత రంగంలో ఐటిఐ పాస్ సర్టిఫికేట్ తో పాటు ఐటిఐ తర్వాత 1 సంవత్సరం అనుభవం. లేదా ఎలక్ట్రిషియన్ లేదా సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ పాస్ సర్టిఫికేట్‌తో పాటు ఐటిఐ తర్వాత 1 సంవత్సరం అనుభవం. లేదా డిప్లొమా లో మెకానికల్ ఇంజనీరింగ్ (DME) 1 సంవత్సరం అనుభవం.
•ఆఫీస్ సబార్డినేట్ :: ఏడవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సైకిల్ తొక్కగలగాలి.

»నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో నెలకు రూ. 15,000/- to 18,500/- మధ్యలో శాలరీ ఇస్తారు.
»వయోపరిమితి: అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ 27-03-2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి మరియు 42 సంవత్సరాలు మించకూడదు.
వయస్సు సడలింపు: ఎస్సీ / ఎస్టీ / బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.
»దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీ లేదు.
»ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థుల జాబితా మరియు సర్టిఫికెట్స్ ధృవీకరణ / రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి :: అభ్యర్థులు పూర్తి చేసిన తమ దరఖాస్తులను ప్రత్యక్షంగా లేదా పోస్టు ద్వారా ప్రిన్సిపాల్ గారి కార్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, నార్పలకు, ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, 08-06-2026 నుండి 20-06-2026 వరకు సమర్పించాలి. నిర్ణీత తేదీ మరియు సమయం తర్వాత అందిన దరఖాస్తులు ఏ పరిస్థితుల్లోనూ స్వీకరించబడవు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధృవపత్రాల అట్టఫైడ్ ప్రతులను మరియు తగిన పోస్టల్ స్టాంపులతో రెండు స్వీయ చిరునామా కవర్లు (పరిమాణం 5″ 10″) జతపరచాలి. పోస్టల్ ఆలస్యాలు పరిగణించబడవు.
ముఖ్యమైన తేదీ వివరాల
•ఆఫ్ లైన్ దరఖాస్తును ప్రారంభం తేదీ : 06 జూన్ 2026
•దరఖాస్తులను స్వీకరించే చివరి తేదీ :: 20 జూన్ 2026.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Office Website Click Here

