రోడ్డు రవాణా శాఖ ద్వారా NHAI Summer Internship Program: నెలకు 20,000 వేల స్టైపెండ్‌తో వెంటనే దరఖాస్తు చేసుకోండి
NHAI Summer Internship Program 2026 All details in telugu : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) విద్యార్థులకు గొప్ప అవకాశం అందించింది. వేసవికాలంలో ఇంటర్షిప్ ప్రోగ్రామ్ 2026 ద్వారా వివిధ కోర్సులకు విద్యార్థులకు హైవే ప్రాజెక్టుపై ప్రాక్టికల్ అనుభవం పొందవచ్చు కెరియర్ ప్రారంభంలో ఉన్న వారికి ఇది ఉత్తమ అవకాశం. NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026 ప్రారంభమైంది!
దేశవ్యాప్తంగా జాతీయ రహదారి ప్రాజెక్టులలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందేందుకు విద్యార్థులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తూ, NHAI తన 2 నెలల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

గత ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ల విజయం ఆధారంగా, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ నుండి టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, కామర్స్ మరియు మాస్ కమ్యూనికేషన్ వరకు బహుళ విభాగాలను చేర్చడానికి విస్తరించారు. ఇది యువతకు విస్తృత అవకాశాలను అందిస్తుంది.
ఎంపికైన ఇంటర్న్‌లు NHAI ఫీల్డ్ ఆఫీసులు మరియు ప్రధాన కార్యాలయంలో అనుభవజ్ఞులైన నిపుణుల మార్గదర్శకత్వంలో పనిచేస్తారు. తద్వారా భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి వ్యవస్థపై వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందుతారు. నెలకు ₹20,000 స్టైఫండ్ మరియు ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు సర్టిఫికేట్ అందించబడుతుంది.
•స్టైపెండ్ : నెల కు ₹20,000/-
•కాల వ్యవధి : మే 4వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు సుమారుగా రెండు నెలలు
•పని ప్రదేశం : NHAI ఫీల్డ్ ఆఫీసర్ లేదా హెడక్వార్టర్స్ ఇంటర్నషిప్ ప్రోగ్రామ్
•విద్యా అర్హత : ఈ ఇంటర్నషిప్ ప్రోగ్రామ్ కోసం సివిల్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్, AI, కామర్స్ సైన్స్ బీఏ బీకాం బీఎస్సీ, లా బిఏ ఎల్ఎల్ బి, ఎంబీఏ ఫైనాన్స్ మార్కెటింగ్, మాస్ కమ్యూనికేషన్ లైబ్రరీ సైన్స్ వంటి విద్యా అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులకు ఇంటర్ షిప్ సమయంలో రహదారుల ప్రాజెక్టు ప్లానింగు ప్రాజెక్ట్ అమలు నిర్వహణ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.
•ఎంపిక ప్రక్రియ : సీనియర్ అధికారుల పర్యవేక్షణ రియల్ టైం హైవే ప్రాజెక్టులపై పని చేసే అవకాశం కలుగుతుంది.
•దరఖాస్తు విధానం : ఆసక్తికరమైన విద్యార్థులు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
•దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15 ఏప్రిల్ 2026


