AP Intermediate Results 2026 date : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు తేదీ ప్రకటన
AP Intermediate Results 2026 date : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి రంజిత్ భాష తెలిపారు. మొత్తం ఈ సంవత్సరంలో 3.87 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షక విద్యార్థి హాజరయ్యారు. ఈనెల 21 నుంచి జవాబు పత్రాలు మూల్యాంకనం చేపట్టినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల లో మూలంకరణ కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో లెక్చరర్ లకు ఉదయం 15 మధ్యాహ్నం 15 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయవలసి వస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వీలైతే 6వ తేదీన విడుదల చేస్తారు. లేదా ఏప్రిల్ 10వ తేదీ లోపు వెళ్లడయ్యే అవకాశాలు ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాల పున: ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉదయం 10:00 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూల్యాంకనం ముమ్మరంగా వేగంగా కొనసాగుతుంది.
ఈ సంవత్సరం ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 31వ తేదీ వరకు వేసవి సెలవులు. అలాగే జూన్ ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం క్లాసులు కూడా ప్రారంభం కావాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు 2026 ఎలా చెక్ చేయాలి
విద్యార్థులు ముందుగా https://bie.ap.gov.in/#home వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. అందులోనే హోమ్ పేజీలో AP Inter (First & Second Year) IPE February/March 2026 Results 2026 అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ రిజల్ట్స్ ని ఈజీగా కనుక్కోవచ్చు. అలాగే +91 95523 00009 మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) – Hi ద్వారా కూడా విద్యార్థులు రిజల్ట్స్ మీ కనుక్కోవచ్చు.


