PAN Card : ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ కార్డులో కొత్త రూల్స్.. ఇవే
PAN Card 2026 April new rules in Telugu : ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తులు నిబంధనలు మారునన్నాయి. కేంద్రం ప్రభుత్వం కొత్త పాన్ కార్డు చేసుకోవడానికి ఆధార్ కార్డు తో పాటు అదనపు డాక్యుమెంట్ తప్పనిసరి అని వెల్లడి చేశారు.

ఏప్రిల్ 1 తేదీ నుంచి కొత్త సంవత్సరం 2026-27 సంబంధించి పాన్ కార్డు దరఖాస్తులు కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం పాన్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు కాపీ జమ చేస్తే సరిపోయేది. కానీ ఏప్రిల్ 1 తేదీ తర్వాత కొత్త సంవత్సరంలో పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు ఆధార్ కార్డుతో పాటు అదనపు డాక్యుమెంటు జమ చేయవలసి వస్తుంది. కేవలం ఆధార్ కార్డుతోనే పాన్ కార్డు పొందాలనుకునే అభ్యర్థులకి మార్చి 31 తేదీ లోపే తుది గడువు అనేది ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ తెలిపారు.
ప్రస్తుత కాలంలో ఆర్థిక లావాదేవీలు మరియు బ్యాంకింగ్ కి పాన్ కార్డు తప్పనిసరి చేశారు. ఆదాయంతో సంబంధం లేకుండా పాన్ కార్డు అనేది తప్పనిసరి. ప్రస్తుతం మార్చి 31వ తేదీ లోపల పాన్ కార్డు పొందాలనుకుంటే ఆధార్ కార్డు చేస్తే సరిపోయేది. కానీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అందుకు కాను కొన్ని నిబంధన కేంద్ర ప్రభుత్వం మార్చింది, ఆధార్ కార్డు తో పాటు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి మార్క్ లిస్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ & అప్పి డిబేట్ పత్రాలు ఏదో ఒకటి సమర్పించుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 1 తేదీ ఈ -సేవ & కామన్ సెంటర్లు వీటిలో ఏదో ఒకటి కావాలని తెలియజేస్తున్నారు.

ఏప్రిల్ 1 తేదీ తర్వాత పాత పాన్ కార్డు దరఖాస్తు ఫామ్ ని కూడా అనుమతించేది ఉండదని కామన్ సర్వీస్ సెంటర్ తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పాన్ కార్డు దరఖాస్తు ఫామ్ కూడా మారుతాయి అని కొత్తవి అందుబాటులో వస్తాయని కామన్ సర్వీస్ సెంటర్ తెలుపుతున్నారు. అలాగే ఆన్లైన్లో కొత్త పాన్ కార్డు దరఖాస్తు కోసం Utiitsl Pan, Protean అనే వెబ్ సైట్ సందర్శించాలి. అలాగే తక్షణం ఇ-పాన్ పొందాలనుకున్న అభ్యర్థులు ఆదాయ పన్ను e-feeling portal కూడా పొందవచ్చును.

