PMAY-G 2.0 ఏపీ గవర్నమెంట్ & కేంద్రం తీపి కబురు.. ఇకపై ఇళ్ల నిర్మాణం లో ఒక ఇంటికి రూ. 2.39 లక్షలు
PMAY Gramin 2.0 Unit Cost AP All Details in Telugu : ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఆదురుపోయే శుభవార్త అందించింది.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY-G) 2.0 పథకం కింద పేదలకు ఇళ్లకు నిర్మాణంలో ఆర్థిక సహాయం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒక్కొక్క ఇంటికి నిర్మాణానికి మొత్తం రూ. 2,39,000/- ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోగ్రా మహిళా సంఘాలకు అతి తక్కువ వడ్డీతో 80 వేల రుణం అందిస్తున్నారు.

ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 2.0 పథకం కింద ఇల్లు నిర్మించుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లబ్ధిదారులకు రూ.1,20,000/- వ్యయాన్ని ఇప్పుడు రూ.2.39 లక్షలకు పెంచడం ద్వారా లబ్ధిదారులపై ఆర్థిక భారం పూర్తిగా తగ్గుతుంది. ఎందుకు కాను కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతం అనగా 72000/- రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం అనగా 48000 అందజేస్తున్నారు. అలాగే అదనంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 27,000 మరుగుదొడ్ల నిర్మాణానికి మరో 12000 కేటాయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగా అర్హులైన అభ్యర్థులందరికీ పక్కా ఇల్లు నిర్మించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ డోగ్రా మహిళలకు మరొక శుభవార్త తెలియజేశారు.. వీడితోపాటు పావలా వడ్డీకి 80,000 బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం. లబ్ధిదారులకు ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అంజయ్య జైన్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని ఆర్నాహులైన పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కలిగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక శ్రద్ధతో నేరుగా లబ్ధిదారి బ్యాంకు అకౌంట్లో నేరుగా రూ. 2.39లక్షల జమ అయ్యేవిధంగా ఎటువంటి పారదర్శకం లేకుండా పేదల సొంత ఇల్లు కల నెరవేర్చే ఉద్దేశంతో అధికారులు భావిస్తున్నారు.

