7th, 10th అర్హతతో AP గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Anganwadi Teacher, Helper Recruitment 2025 October in Telugu
AP Anganwadi Teacher & Helper Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లాలో గల ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ & అంగన్వాడీ హెల్పర్ పోస్టు భర్తీ కొరకు జతపరచబడిన జాబితాలో పేర్కొన్న కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయుటకు అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి.
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (07) పోస్టులు & అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు (53) ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. కేవలం ఏడో తరగతి పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 01.07.2025 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. అప్లై చేసుకుంటే సొంత వార్డు లేదా సచివాలయంలో ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులపై నియామకాలు జరుగుతాయి:
ఈ నియామక ప్రక్రియ ద్వారా అంగన్వాడీ టీచర్ (07) పోస్టులు & అంగన్వాడీ హెల్పర్ (53) ఉద్యోగాలు మొత్తం 60 జాబ్స్ భర్తీ చేస్తారు.
వయోపరిమితి: 01.07.2025 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
అర్హతలు: అంగన్వాడి సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది. అంగన్వాడి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
జీతం: అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్ధిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము నెలకు Rs. 7,000/- మాత్రమే చెల్లించబడును. అలాగే అంగనవాడి టీచర్ ఉద్యోగాలకు రూ.11,500 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం :
దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో పైన తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదైన గజిటెడ్ అధికారి చే సంతకం చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పధక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయం భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభం: 03 అక్టోబర్ 2025
• దరఖాస్తుకు చివరి తేదీ: 14 అక్టోబర్ 2025.
కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబందిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని /పోస్టు ద్వారా గాని తేది 03-10-2025 నుండి 14-10-2025 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.

🛑Anganwadi Helper Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Anganwadi Teacher Notification Pdf Click Here
🛑Application Pdf Click Here