APPSC Jobs : ఒకేసారి 4 నోటిఫికేషన్ విడుదల
APPSC 4 Notification 2025 Release : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో ఒకేసారి 4 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు అప్లై చేయాలనుకుంటే వయసు 18 సంవత్సరాల నుంచి 47 మధ్యలో ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.

APPSCపోస్ట్ వివరాలు
•A.P. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ సైన్స్‌లో జూనియర్ లెక్చరర్ -02 పోస్టులు
•హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, గ్రేడ్-ఇల్ (మహిళలు) ఇన్ A.P. B. C. వెల్ఫేర్ సబ్-సర్వీస్ – 01 పోస్టులు
•A.P. ఫారెస్ట్ సబ్-సర్వీస్‌లో డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-1 (టెక్నికల్ అసిస్టెంట్)- 13 పోస్టులు
•గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య ఇంజనీరింగ్ సేవలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్)- 03 పోస్టులు
•A.P. హార్టికల్చర్ సర్వీస్‌లో హార్టికల్చర్ ఆఫీసర్ – 02 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ విండో 18/09/2025 నుండి 08/10/2025 వరకు రాత్రి 11:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

🛑Notification Pdf Click Here