10th అర్హతతో కొత్తగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | Intelligence Bureau Security Assistant/ Executive Recruitment 2025 | Telugu Jobs Point
Intelligence Bureau Security Assistant/ Executive Notification Out for 4987 Posts, 10th Pass Only Apply Online @mha.gov.in : కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థుల కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో లో కొత్త గా 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ)లో సెక్యూరిటీ అసిస్టెంట్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డైరెక్ట్ నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 17.08.2025 నాటికి 18 to 27 సంవత్సరాల, వయసు సడలింపు ఉంటుంది. గల అభ్యర్థులకు రూ. 21,700/- to రూ.69100/- జీతం ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు IB వెబ్సైట్ https://www.mha.gov.in/en ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ విండో జులై 26, 2025 నుండి ఆగష్టు 17, 2025 వరకు 11:59 (అర్ధరాత్రి) వరకు తెరిచి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 26 జులై 2025
*దరఖాస్తు చివరి తేదీ = 17 ఆగష్టు 2025
ఇంటెలిజెన్స్ బ్యూరో (గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) భారత ప్రభుత్వం సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పరీక్ష – 2025, అభ్యర్థి www.mha.gov.in లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా తమ బయో-డేటాను నమోదు చేసుకోవాలి.
ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పరీక్ష – 2025 ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఇంటెలిజెన్స్ బ్యూరో (గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) నోటిఫికేషన్ విడుదల
పోస్ట్ పేరు :: సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 27 Yrs
మొత్తం పోస్ట్ :: 4987
దరఖాస్తు ప్రారంభం :: 28 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 17 ఆగష్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్సైట్ :: www.mha.gov.in
»పోస్టుల వివరాలు: 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: గుర్తింపు పొందిన విద్యా మండలి నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి ఉత్తీర్ణత) లేదా తత్సమానం, అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం యొక్క నివాస ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండటం. తెలుగు భాష వస్తే అప్లై చేసుకుంటే పర్మినెంట్ ఉద్యోగం పొందుతారు.
»వయసు: 17.08.2025 నాటికి 18 to 27 సంవత్సరాలు.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: నెలకు జీతం లెవల్-3 రూ.21,700/- to రూ.69,100/- ఇస్తారు.
»పోస్టులకు వర్తించే దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రూ. 650/- & ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి రూ. 550/- ఫీజు చెల్లింపు విధానం ఆన్లైన్ లో చెల్లించాలి.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్ మరియు వైద్య పరీక్ష, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి: అర్హులైన అభ్యర్థులు కేవలం https://www.mha.gov.in/en వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here