ICDS Anganwadi Recruitment : 10th అర్హతతో అంగన్వాడీ కేంద్రాలలో అత్యవసర ఉద్యోగ నోటిఫికేషన్ అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ
Latest Anganwadi Teacher & Anganwadi Helper Notification 2024 in Telugu : నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకుంటే సొంత జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు పొందవచ్చు. వివిధ మండలాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో 21 ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ICDS) ప్రాజెక్ట్ పరిధిలో ఈ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
అంగన్వాడీ కేంద్రాల్లో నోటిఫికేషన్ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ICDS) ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జారీ చేయబడింది. సత్తెనపల్లి నియోజకవర్గం అంతటా ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఖాళీలు గుర్తించబడ్డాయి.
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఇందులో 2 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు మరియు 19 ఆయాల పోస్టులు ఉన్నాయి. మండలాల వారీగా ఖాళీల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం & నకరికల్లు మండలం లో కార్యకర్త & ఆయాల పోస్టులు ఉన్నాయి.
అంగన్వాడీ అర్హతలు
అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టులకు అర్హతలు కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి:
• అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
• అభ్యర్థుల వయస్సు 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి పరిగణనలోకి తీసుకుంటారు.
• అభ్యర్థులు వివాహితురాలు మరియు స్థానిక నివాసితురాలు అయి ఉండాలి.
అంగన్వాడీ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
అంగన్వాడీ దరఖాస్తు సమర్పించేటప్పుడు కింద పేర్కొన్న ధృవీకరణ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది:
• పుట్టిన తేదీని నిర్ధారించే ధృవీకరణ పత్రం
• 10వ తరగతి సర్టిఫికేట్
• కుల ధృవీకరణ పత్రం
• స్థానిక నివాస ధృవీకరణ పత్రం
• వివాహితురాలైతే వివాహ ధృవీకరణ పత్రం
• అనుభవం ఉంటే అనుభవ పత్రం
• వికలాంగులు అయితే వికలాంగ ధృవీకరణ పత్రం
• వితంతువులయితే భర్త మరణ ధృవీకరణ పత్రం
పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ చేసి గ్రాజిటెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ చేసిన తర్వాత ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం
• ఈ పోస్టులకు దరఖాస్తు చేయడం కోసం అభ్యర్థులు సత్తెనపల్లి ICDS కార్యాలయంలో దరఖాస్తు ఫారమ్ తీసుకోవాలి.
• ఫారమ్ పూర్తి చేసి, అవసరమైన పత్రాలు జతచేసి 2024 డిసెంబర్ 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలి.
• దరఖాస్తులను సంబంధిత అంగన్వాడీ కేంద్రాలు లేదా గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.