Anganwadi Jobs : అంగన్వాడీలు 9000 ఉద్యోగాలు ఈ డాక్యుమెంట్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది… త్వరగా రెడీ చేసుకోండి
Anganwadi Jobs : మహిళలకు శుభవార్త, ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ పాస్ అయిన మహిళ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. తెలంగాణలో 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టు త్వరలో మీకు జిల్లాల వారీగా ఉద్యోగాలు అయితే రిలీజ్ కానున్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లయితే ఒక వారం లేదా పది రోజులు మాత్రం మీకు టైం ఉంటుంది. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ వల్ల అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ వాళ్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Anganwadi Teacher Recruitment: తెలంగాణలో అంగన్వాడీ 9,000 ఉద్యోగాలకు ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అర్హత మనం చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినా అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. మహిళలు అయి ఉండాలి, స్థానికంగా ఉండాలి. అలాగే 65 ఏళ్ల దాటిన అభ్యర్థులు తరువాత వాళ్లు సేవలు వినియోగించుకోకూడదు. ఖాళీలు 50% హెల్పర్ పదోన్నతి టీచర్ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సూపర్వైజర్ పోస్ట్ కోసం 50% పదోన్నతులు కల్పిస్తున్నారు. మిగిలిన పోస్టులన్నీ కూడా డైరెక్ట్ పార్టీ చేస్తున్నారు.
అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ : 11500/-, మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతన రూ: 7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7000/- చెల్లించబడుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల SC/ST/BC అయితే (నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వమునకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.
నివాసం-స్థానికురాలు అయి ఉండాలి | (నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ఆధార్ మొదలగునవి…) | తప్పనిసరిగా జతపరచవలయును |
పదవ తరగతి ఉత్తీర్ణత | మార్క్స్ మెమో | తప్పనిసరిగా జతపరచవలయును |
పుట్టిన తేది & వయసు నిర్దారణకు | పదవ తరగతి మార్క్స్ మెమో | తప్పనిసరిగా జతపరచవలయును |
కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే) | తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన | తప్పనిసరిగా జతపరచవలయును |
వికలాంగత్వము | వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును | తప్పనిసరిగా జతపరచవలయును |
ఫోటో | దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో | దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయునుఅటెస్ట్ చేయవలయును. |
పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అప్లై చేయడానికి టైమ్ అనేది చాలా తక్కువ ఇస్తారు రిలీజ్ అయినట్లయితే.
🔴ఆంధ్రప్రదేశ్ లో అన్ని వివరములు జిల్లా వెబ్ సైట్ https://igod.gov.in/sg/AP/E042/organizations ను సంప్రదించగలరు మరియు పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత సిడిపివో కార్యాలయము నందు సమర్పించవలెను.
🔴 తెలంగాణ లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి https://mis.tgwdcw.in/ ఈ వెబ్ పేజి నుంచి.