TG Gurukul Special Classes: ఈ నెల 16 వరకు సెలవులు లేవు.. స్పెషల్ క్లాసులు
TG Gurukul Special Classes October 16Latest News : తెలంగాణలోని బీసీ, మైనారిటీ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) విద్యార్థులకు ఈ నెల 16 వరకు స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నారు. ఐఐటీ-జేఈఈ (IIT-JEE), క్లాట్ (CLAT) ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సంబంధిత సొసైటీలు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 16 వరకు సెలవులు ఉండవు.
మరోవైపు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించారు. తమకు కూడా ఇదే విధంగా సెలవులు ఇవ్వాలని బీసీ, మైనారిటీ గురుకులాల సిబ్బంది కోరుతున్నారు. అయితే, ఈ గురుకులాలకు సంబంధించి సెలవులపై ఎలాంటి మార్పు ఉంటుందనేది స్పష్టత రావాల్సి ఉంది.


