తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు? దసరాలోపు రూ.13,000 జమ అయ్యే అవకాశం | Thalliki Vandanam Scheme 2026 Latest News
AP Thalliki Vandanam Second Phase Payment Update : AP తల్లికి వందనం రెండో విడతలో 2,39,201 మంది లబ్ధిదారులకు రూ.13,000 సాయం అందే అవకాశం ఉంది. నిధుల విడుదల తేదీ, పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయంపై కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13,000 చొప్పున సాయం దసరాలోపు జమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, నగదు జమయ్యే తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తల్లికి వందనం పథకం రెండో విడత నిధులను షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 30న విడుదల చేయాల్సి ఉంది. అయితే, పలు కారణాలతో నిధుల విడుదల ఆలస్యమైంది. తాజాగా మరో 58,601 మంది విద్యార్థులను అర్హులుగా చేర్చడంతో రెండో విడత లబ్ధిదారుల సంఖ్య 2,39,201కు చేరింది.
తల్లికి వందనం పథకం తొలి విడతలో భాగంగా మొత్తం 64.76 లక్షల మందికి ఆర్థిక సాయం అందించారు. మొదటి తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరాల్సిన కొందరు విద్యార్థులు, అలాగే రికార్డుల్లో లోపాలు ఉన్నవారు మినహా మిగిలిన అర్హులకు సాయం జమ చేశారు.
డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి : రెండో విడత నిధులు దసరాలోపు లబ్ధిదారుల ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఖచ్చితమైన తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్పష్టత వస్తుంది. లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతా వివరాలను సరిచూసుకోవడంతో పాటు ప్రభుత్వ ప్రకటనలను గమనించాలి.


