RRB NTPC 2026 : ఇంటర్మీడియట్ తో 1,688 టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు.. అక్టోబర్ 15 నుంచి దరఖాస్తులు
RRB NTPC Undergraduate Recruitment 2026 1688 Posts : రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ముఖ్యమైన సమాచారం. RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1,688 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ను 2026 అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. అదే తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

1,688 పోస్టుల భర్తీ : CEN నంబర్ 07/2026 కింద నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి మొత్తం 1,688 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు 7వ సెంట్రల్ పే కమిషన్ (7th CPC) Level-2, Level-3 ప్రకారం వేతన స్కేల్ వర్తిస్తుంది.
విద్యార్హత ఏమిటి : పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ లేదా బోర్డు నుంచి అవసరమైన 12వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. పూర్తి విద్యార్హతలు, వయోపరిమితి, పోస్టుల వారీగా ఖాళీలు, పరీక్ష విధానం వంటి వివరాలను పూర్తి నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు.
దరఖాస్తులు ఎప్పటి నుంచి : RRB NTPC UG 2026 దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 15, 2026 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 13, 2026 రాత్రి 11:59 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. ఇవి ప్రస్తుతం ప్రకటించిన తాత్కాలిక తేదీలు. అధికారిక వెబ్సైట్లోనే అప్లై చేయాలి. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తును ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అధికారిక RRB వెబ్సైట్ లేదా https://www.rrbapply.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

