AP కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ 40 పోస్టులు.. జీతం రూ.1.47 లక్షల వరకు |APPSC Assistant Environmental Engineer Jobs 2026

AP కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ 40 పోస్టులు.. జీతం రూ.1.47 లక్షల వరకు |APPSC Assistant Environmental Engineer Jobs 2026

APPSC Assistant Environmental Engineer Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు APPSC నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు APPSC నోటిఫికేషన్ మరియు ఎగ్జామ్ టైటాన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.57,100 నుంచి రూ.1,47,760 పే స్కేల్‌లో జీతం లభిస్తుంది.

దరఖాస్తు తేదీలు : ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6, 2026 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. వయోపరిమితికి సంబంధించిన పూర్తి నిబంధనలు, సడలింపులు వివరణాత్మక నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. ఇది అంచనా మాత్రమే.

విద్యార్హత : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సివిల్, మెకానికల్, కెమికల్ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. AMIE (India)లో సివిల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన Section A, Bలో అర్హత సాధించిన వారిని కూడా నిబంధనల ప్రకారం పరిగణించే అవకాశం ఉంది. ఇది అంచనా మాత్రమే. 

ఎంపిక విధానం అభ్యర్థుల ఎంపికకు ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.

•పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలు, 150 మార్కులు.

•పేపర్-2: సంబంధిత సబ్జెక్ట్ – 150 ప్రశ్నలు, 300 మార్కులు.

•మొత్తం పరీక్షకు 450 మార్కులు ఉంటాయి. పరీక్షలో తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/3 మార్కు తగ్గిస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి : APPSC ద్వారా మొదటిసారి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో OTPR (One Time Profile Registration) పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది. ఇప్పటికే OTPR ఉన్న అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఫీజు, పరీక్షకు సంబంధించిన ఇతర నిబంధనలు అక్టోబర్ 6, 2026న లేదా అంతకంటే ముందు విడుదలయ్యే వివరణాత్మక నోటిఫికేషన్‌లో ఉంటాయి.

🛑Notification Pdf Click Here

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *