SSC CGL 2026: 12,256 ఉద్యోగాలకు ఎగ్జామ్ సెంటర్ వివరాలు వచ్చేశాయి
SSC CGL 2026 Exam City Details 12256 Posts : 12,256 గ్రూప్-B, గ్రూప్-C ఉద్యోగాల కోసం నిర్వహించే Tier-1 పరీక్షకు ఎగ్జామ్ సిటీ వివరాలు వచ్చాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు పరీక్షలు జరగనున్నాయి.
SSC CGL-2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. 12,256 గ్రూప్-B, గ్రూప్-C పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న CGL Tier-1 పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
అభ్యర్థులు SSC అధికారిక వెబ్సైట్ (https://ssc.gov.in/login) లోకి వెళ్లి తమ లాగిన్ వివరాలతో పరీక్షకు కేటాయించిన నగరాన్ని చెక్ చేసుకోవచ్చు. అక్కడ పరీక్షకు సంబంధించిన తేదీ, షిఫ్ట్ వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. SSC CGL 2026 Tier-1 పరీక్షలు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖలు, సంస్థల్లో 12,256 గ్రూప్-B, గ్రూప్-C ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగానే తమ ఎగ్జామ్ సిటీ, పరీక్ష తేదీ, షిఫ్ట్ వివరాలను చెక్ చేసుకుని, పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. హాల్ టికెట్‌ను కూడా పరీక్ష తేదీకి దగ్గరగా అధికారిక వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి.


