మహిళల కోసం ఇలాంటి తాకట్టు లేకుండా రూ. 3 లక్షల వడ్డీ లేని రుణం | udyogini scheme details in Telugu
Udyogini Scheme 2026 Details In Telugu : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సొంత చిన్న వ్యాపారం చేయాలనుకున్న మహిళా అభ్యర్థుల కోసం గొప్ప అవకాశం కల్పిస్తుంది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉద్యోగ యోజన పథకం ఎంతగానో సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా ఎలాంటి తాకట్టు లేకుండా 3 లక్షల వరకు రుణం పొందుతారు.

స్వయం ఉపాధి ప్రారంభించాలన్న మహిళలకు, ఉన్న బిజినెస్ అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఉద్యోగ యోజన పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. అర్హులైన మహిళలందరూ స్వయం ఉపాధి పొందవచ్చు. ఈ పథకం ద్వారా మహిళా అభ్యర్థులకు 30 శాతం రాయితీ లభిస్తుంది ఎస్సి వర్గాలకు చెందిన మహిళలకు 50% వరకు రాయితీ పొందుతారు. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు మధ్య ఉన్న వాళ్ళందరూ అర్హులే. ఇందుకుగాను ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ దృవీకరణ పత్రాలు తీసుకొని బ్యాంకు ద్వారా లేదా ఉమెన్ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలకు మించి ఉండకూడదు. వితంతువులు నిరుపేదలు అంగవైకల్యం ఉన్న మహిళా అభ్యర్థులకు ఆదాయ ధ్రువీకరణ పత్రం నుండి మినహాయింపు ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఉద్యోగి స్కీం అద్భుత పథకం.. ఈ పథకం ద్వారా మహిళలకు రూ.3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఎలాంటి తాకట్టు లేకుండా ఈ రుణం పొందొచ్చు. ఆహార పదార్థాల తయారీ, చేతి వృత్తులు & చిరు వ్యాపారం మొదలైనవి పెట్టవచ్చు. ఈ స్కీం ద్వారా 88 రకాల చిన్న వ్యాపారాలు వర్తిస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న మహిళా అభ్యర్థులు ఏదైనా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవొచ్చు లేదా ఉమంగ్ https://web.umang.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


