తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. ఆగస్టు నెలలో అన్ని శుభవార్తలే.. ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే | Telangana new pension, new ration card All Details
Telangana new Cheyutha pension, new PVC ration card August month all good news : తెలంగాణలో ఆగస్టు నెలలో వివిధ రకాల సంక్షేమ మరియు అభివృద్ధి మాసంగా మారింది. ఈనెల 15వ తేదీన కొత్త పెన్షన్లు, కొత్తగా PVC రేషన్ కార్డులు, కొత్తగా ఐదు లక్షల మందికి సబ్సిడీ సిలిండర్లు మరియు 4 లక్షల ఇళ్లు ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. అదే రోజున సనత్ నగర్లో నిర్మిస్తున్న టీమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్) సేవలకు ప్రారంభం చేయనన్నారు.

తెలంగాణలో 1.5 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈనెల 15న ప్రారంభిస్తున్న సంగతి తెలిసినదే. ఈ రేషన్ కార్డులు ముఖ్యంగా నకిలీ అక్రమ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ట్యాంపర్ ప్రూఫ్ కార్డులను రూపొందించింది. ఈ కార్డు వివరాలు మార్చేందుకు వీలుకాకుండా లామినేషన్ కార్డులు తయారు చేస్తుంది. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఆధార్ ఆధారంగా ఇంటి ఇల్లాలి ఫోటోతో PVC QR కోడ్ తో కూడిన రేషన్ కార్డు ఇస్తున్నట్లు సమాచారం. అంతకుముందే ఈ కేవీసీ అనేది తప్పనిసరిగా చేయండి. అందుకుగాను మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ డీలరు & మీ సేవ కేంద్రం ద్వారా చేయవచ్చు.
తెలంగాణలో మరో 5 లక్షల మందికి 500 కే వంట సిలిండర్ కోసం మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ప్రస్తుతం 42.90 లక్షల ఫ్యామిలీ కు లబ్ధి పొందు పొందుతుండగా సంవత్సరంలో రూ.730 కోట్ల ఖర్చవుతుంది. కొత్తగా మరో ఐదు లక్షల పైగా అర్హులను పౌర సరఫరా చేయక గుర్తించారు ఈ జాబితాను ప్రభుత్వ ఆమోదం కోసం పంపడం వ్యయంతో ఆర్థిక శాఖ అధ్యయనం చేస్తుంది. ఈ పథకం కూడా ఈనెల 15న ప్రారంభం కానున్నది.
తెలంగాణలో ప్రజలకు భారీ శుభవార్త ఆసరా పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. తమ దగ్గర ఉన్న పంచాయతీ కార్యదర్శి/ MPDO ఆఫీసులలో బలేసి వెంటనే అప్లై చేసుకోవాలని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తెలిపింది చివరి తేదీ ఏమీ లేదని స్వస్థత చేసింది. గతంలో చేసుకున్న దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయనవసరం లేదని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతులు, గీత, చేనేత కార్మికులు, బోధకాలు & డయాబెటిస్ బాధితులకు వికలాంగులకు ఈనెల 15వ తేదీన 2.25 లక్షల మందికి నూతన పెన్షన్ ఇవ్వనన్నారు. ఇప్పుడు వరకు మీరు అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి.

తెలంగాణలో సెప్టెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ టవల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వం భావిస్తుంది. మూసీ, గాంధీ సరోవర్, ఫ్యూచర్ సిటీలపై ఫోకస్, TIMS కూడా ఆగస్టు 15న ప్రారంభించడం జరుగుతుంది. ఫుడ్ డెలివరీ క్యాప్ సేవలు ఇతర ప్లాట్ఫారం ఆధారిత పనులు చేస్తున్న గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించింది అన్నారు. అలాగే 3 నుంచి 4 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు గృహ జ్యోతి పథకం పరిధిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

