Anganwadi Jobs : 12th అర్హతతో భారీగా అంగన్వాడీ టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ | Telangana Anganwadi Teacher Vacancies 2026
Applications for Telangana anganwadi teacher 2026 Eligibility is required : మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టులు (ధర్మపురి, జగిత్యాల, మల్యాల మరియు మెట్పల్లి)లో ఖాళీగా ఉన్న మొత్తం (64) అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 07.08.2026 ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 21.08.2026 సాయంత్రం 5.00 గంటల వరకు పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, నిబంధనలు మరియు ఇతర పూర్తి వివరాలు http://wdcw.tg.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు:
•ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 07.08.2026
•ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 21.08.2026 సాయంత్రం 5.00 గంటల వరకు.
సంస్థ పేరు : తెలంగాణ ప్రభుత్వం, మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో నోటిఫికేషన్
పోస్టుల వివరాలు : అంగన్వాడీ టీచర్ పోసులు 64 పోస్టులున్నాయి. ధర్మపురి 16 పోస్టులు, జగిత్యాల 22 పోస్టులు, మల్యాల 12 పోస్టులు, మెట్పల్లి 14 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు :
1. విద్యార్హత: అభ్యర్థిని తప్పనిసరిగా కనీసం ఇంటర్మీడియట్/ 12వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
2. వయస్సు: ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01-07-2026 నాటికీ 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండవలెను.
3. స్థానికత: ధరఖాస్తు చేసే అభ్యర్థి స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతంలో అయితే సంబంధిత వార్డులో నివసించాలి. గ్రామీణ ప్రాంతంలో అయితే సంబంధిత గ్రామపంచాయతీలో నివసించాలి, అక్కడే అంగన్వాడీ కేంద్రం ఉండాలి.
4. SC/ST సబ్ ప్లాన్ ప్రకారం SC ఆవాసానికి కేటాయించిన పోస్టులకు, అదే హామ్లెట్/ ఆవాసానికి చెందిన SC అభ్యర్థులు మాత్రమే అర్హులు.
5. SC/ST సబ్ ప్లాన్ ప్రకారం ST ఆవాసానికి కేటాయించిన పోస్టులకు, అదే హామ్లెట్/ ఆవాసానికి చెందిన ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ ₹7,000/- to ₹11,500/- వరకు వస్తుంది.
వయోపరిమితి (01/07/2026 నాటికి)
ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01-07-2026 నాటికీ 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండవలెను.
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉటుంది.
అభ్యర్థుల ఎంపిక విధానం:
1. ఇంటర్మీడియట్ / 12వ తరగతి మార్కులు మార్కుల మెరిట్ నకు 70 మార్కులు.
2. ప్రత్యేక కేటగిరీలు: నితంతువులు- 5 మార్కులు.
3. అనాధలకు -10 మార్కులు
4. దివ్యాంగులు (RPWD Act, 2016 ప్రకారం) – 5 మార్కులు.
5. జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ : 10 మార్కులు.
ఆన్లైన్ లో జతపరచవలసిన స్రువ పత్రాలు (Scanned copies)
*పుట్టిన తేది / వయస్సు ధృవికరణ పత్రం (SSC).
*తహశీల్దార్ గారిచే నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు తీసుకున్న నివాస దృవీకరణ పత్రం తప్పనిసరిగా జతపర్చాలి.
*ఇంటర్ / ఆపై విద్యార్హతల మార్కుల జాబితా (Memo).
*అభ్యర్థులు తప్పనిసరిగా కుల దృవీకరణ పత్రం జతపర్చాలి.
*ప్రత్యేక కేటగిరి వర్తించేవారు (Special Category): సదరం దృవీకరణ పత్రం (దివ్యాంగులు), భర్త మరణ దృవీకరణ పత్రం (వితంతువులు), అనాధ దృవీకరణ పత్రం (3] Act, 2015 ప్రకారం).
•దరఖాస్తు చేసుకునే విధానం : ధరఖాస్తుతో పాటు తగు దృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారి అటేస్టేషన్ తో తేది: 07.08.2026 నుండి 21.08.2026 2 5.00 6.0 5 5 http://wdcw.tg.nic.in ద్వారా మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలి. ధరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఐ.సి.డి. యస్. ప్రాజెక్టు కార్యాలయంనందు 27.08. 2026 నుండి 05.09.2026 వరకు కార్యాలయ పనివేళలలో ఒరిజనల్’ సర్టిఫికేట్లు పరిశీలన (Scrutiny) చేయించుకోగలరు. లేనిచో ధరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. DWO/CDPO /ప్రజావాణి / పోస్టు / ఈ-మెయిల్’ ద్వారా సమర్పించిన ధరఖాస్తులను పరిగణలోకి తీసుకొనబడవు. కేవలం ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన ధరఖాస్తులను, దృవీకరణ పత్రములు మాత్రమే పరిగణలోకి తీసుకోబడును.
ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేయుటకు, సవరించుటకు, మార్పులు చేయుటకు లేదా అవసరమైన ఇతర నిర్ణయాలు తీసుకొనుటకు శ్రీయుత కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్/ఛైర్మన్, జగిత్యాల గారికి పూర్తి అధికారం కలదు. (కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ / చైర్మన్, జిల్లా స్థాయి అంగన్వాడీ నియామక కమిటీ, జగిత్యాల గారి తరుపున, వారి అనుమతితో).
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 07-08-2026
• దరఖాస్తు చివరి తేదీ: 21-08-2026 సాయంత్రం 5.00 గంటల వరకు.
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: http://wdcw.tg.nic.in/

🛑Notification Pdf Click Here
🛑 Roster Wise Vacancy Detail Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

