అంగన్వాడీ కేంద్రంలో టీచర్ & హెల్పర్ ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్..ఇలా అప్లై చేయాలి
మహిళలకు సువర్ణవకాశం.. పరీక్ష లేకుండా ఫీజు లేకుండా అప్లై చేసుకుంటే సొంత గ్రామంలో లేదా వార్డులు ఉద్యోగం వస్తుంది.
నిరుద్యోగులకు మహిళలకు శుభవార్త.. జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలోని ICDS ప్రాజెక్టులు (చేర్యాల్, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట) పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు హేల్పర్స్ (ట్రైబల్) పోస్టుల భర్తీ కొరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరడమైనది.

సంస్థ పేరు : తెలంగాణ ప్రభుత్వం, మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ లో నోటిఫికేషన్
పోస్టుల వివరాలు : అంగన్వాడీ టీచర్ & హెల్పర్ పోస్టుల జాబ్స్
అర్హతలు : అంగన్వాడీ టీచర్ (AWT) మరియు అంగన్వాడీ హెల్పర్ (AWH): కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్/12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ హెల్పర్ మినహాయింపు: ఒకవేళ అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టుకు ఇంటర్మీడియట్/12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్ధులు లభించకపోతే, తర్వాతి తక్కువ విద్యా అర్హత ఉన్న అభ్యర్థులను (SSC /పదో తరగతి) ఎంపిక కోసం పరిశీలిస్తారు.
వయోపరిమితి (01/07/2026 నాటికి) : 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉండవలెను. స్థానికత: అభ్యర్థి సంబంధించిన అంగన్వాడీ కేంద్ర పరిధి వార్డు / డివిజన్ (అర్బన్ పరిధిలో), గ్రామపంచాయతీ (రూరల్ పరిధిలో) నివాసి అయి ఉండాలి. ఎస్సీ / ఎస్టి స్థానాల పరిధి: ఎస్సీ/ ఎస్టి రోస్టర్ కింద కేటాయించిన ఆంగన్వాడీ టీచర్ పోస్టులకు ఆయా గ్రామపంచాయతీ / ఆవాసాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే అర్హులు.
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీ లేదు.
ఎంపిక ప్రక్రియ :
1. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్: 70 మార్కులు
2. ప్రత్యేక కేటగిరీలు:
•అనాథలు (Orphans): 5 మార్కులు
•అనాథ శరణాలయ అభ్యర్థులు / •నిరాశ్రయులు: 10 మార్కులు
దివ్యాంగులు (PWD): 5 మార్కులు
3. జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ: 10 మార్కులు
ఈ నోటిఫికేషన్ను రద్దు చేయడానికి లేదా సవరణలు చేయడానికి జిల్లా కలెక్టర్/ చైర్మన్, సిద్దిపేట జిల్లా గారికి పూర్తి అధికారాలు కలవు.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 05-08-2026
• దరఖాస్తు చివరి తేదీ: 15-08-2026
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: wdcw.tg.nic.in

🛑Notification Pdf Click Here
🛑Roster Wise Vacancy Details Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

