AP EAPCET Results 2026 Release Date : ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది
AP EAPCET Results 2026 Release Date Latest News: ఆంధ్రప్రదేశ్ లో ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కళాశాల ప్రవేశం నిర్వహించిన ఎంసెట్ ఫలితాలు చైర్మన్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఈనెల ఆఖరిలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అందుకు గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లో మే 12 తేదీ నుంచి 20 తేది వరకు ఎంసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే అందులో దాదాపుగా 3,29,000 లక్షల మంది పైగా ఎంసెట్ పరీక్ష రాశారు. ఎంసెట్ షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికి ఫలితాలు విడుదల కావాల్సింది కానీ ఎంసెట్లో ఇంటర్ విద్యార్థుల మార్క్స్ 25% వెయిటేజ్ ఉంది. ర్యాంకుల కేటాయించాలంటే ఇంటర్మీడియట్ మార్క్స్ తప్పనిసరి. ఈ సంవత్సరం 2nd ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. అలాగే ఈ నెల 18న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో రెండు రోజులలో ఎంసెట్ ఫలితాలు విడుదల అవుతాయని ప్రచారం జరుగుతుంది అయితే, ఈ సంవత్సరం సిబిఎస్ 12వ ఫలితాలు సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు రావడంతో ఎంసెట్ ఫలితాలపై మరొకసారి ఆలస్యం జరిగింది.
సిబిఎస్సి రివైజ్ ఫలితాలను ఈనెల ఆఖరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ సంవత్సరం దాదాపుగా ఎనిమిది వేల మంది సిబిఎస్సి విద్యార్థులు ఎంసెట్ పరీక్షలు రాశారు. ఈ కారణంతో ఎంసెట్ ఫలితాలు వారం రోజులు ఆలస్యమైనా ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉండాలని విద్య ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ సూచించారని ఎంసెట్ చైర్మన్ వెల్లడించారు.

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్ ఫలితాలు ప్రకటించిన వెంటనే ఎంసెట్ ర్యాంకింగ్ విడుదల చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం https://cets.apsche.ap.gov.in/ తరచూ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి.

