SSC అర్హతతో సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ గ్రేడ్-II, గ్రూప్ ‘సి’ లోని నోటిఫికేషన్ వచ్చింది | Indian Army CSBO Grade-II Group C Notification 2026 Salary, Eligibility, Application Pdf
Indian Army CSBO Grade-II Group C Recruitment 2026 Latest Civilian Switch Board Operator Grade-II, Group ‘C’ Jobs Notification 2026 Salary, Eligibility, Application Pdf : భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ లో గ్రేడ్-II, గ్రూప్ ‘సి’ లోని CSBO (సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్) పోస్టుకు భారత పౌరుల నుండి నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను sunshine.rise@nic.in అనే అధికారిక ఈమెయిల్ ఐడి ద్వారా సమర్పించవలసి ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం తేదీ 02 మే 2026 మరియు అప్లికేషన్ చివరి తేదీ 31 మే 2026 లోపు అప్లై చేసుకోవాలి.

భారత సైన్యం ప్రధాన కార్యాలయం లో సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ (CSBO) గ్రేడ్-II, గ్రూప్ ‘సి’ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి టెన్త్ పాసైన వారు అర్హులు. వయసు 18-25 ఏళ్ల వయసు ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్టు & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మే 31. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను sunshine.rise@nic.in అనే అధికారిక ఈమెయిల్ ఐడి ద్వారా సమర్పించవలసి ఉంటుంది.
Indian Army CSBO (Civilian Switch Board Operator) Grade-II, GROUP ‘C’ Job Notification 2026 apply 190 Vacancy Overview :
సంస్థ పేరు ::భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ లో గ్రేడ్-II, గ్రూప్ ‘సి’లో జాబ్స్
పోస్ట్ పేరు :: CSBO (సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్) పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::190
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 25 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.₹21,700/- to ₹69,100/-
దరఖాస్తు ప్రారంభం :: 02.05.2026
దరఖాస్తుచివరి తేదీ :: 31.05.2026
అప్లికేషన్ మోడ్ :: https://www.indianarmy.nic.in/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో CSBO (సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్) 190 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»అవసరమైన విద్యా అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్ లేదా దానికి సమానమైనది. ప్రైవేట్ బోర్డ్ ఎక్స్ఛేంజ్ (PBX) బోర్డును నిర్వహించడంలో నైపుణ్యం. (కనీస అనుభవ వ్యవధి 06 నెలలు ఉండాలి). ఆవశ్యకం. ఇంగ్లీష్ మరియు హిందీలో అనర్గళంగా మాట్లాడగలగడం
»నెల జీతం : ఎంపికైన అభ్యర్థులు నెలకు స్టార్టింగ్ శాలరీ రూ.₹21,700/- to ₹69,100/- మధ్యలో జీతం ఇస్తారు.
»వయోపరిమితి: వయస్సు దరఖాస్తు స్వీకరణకు నిర్దేశించిన చివరి తేదీ నాటికి వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాలు. అయితే, ఈ క్రింది ప్రభుత్వ సూచనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఓబీసీ వర్గానికి చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులకు 05 సంవత్సరాలు. దివ్యాంగుల (PwBD) వర్గానికి చెందిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు (SC, ST వర్గాలకు చెందిన PwBD అభ్యర్థులకు అదనంగా 05 సంవత్సరాలు మరియు OBC వారికి 03 సంవత్సరాలు).
»దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీ లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి :: ఈ పోస్టు రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలానికి ఉంటుంది, ప్రొబేషన్ కాలంలో సంతృప్తికరమైన పనితీరుకు లోబడి శాశ్వత నియామకం జరుగుతుంది. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని పత్రాలను స్వీయ ధృవీకరణతో జతచేసి, ది కమాండెంట్, హెడ్ క్వార్టర్స్, 2 సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్, పనాజి (గోవా) 403001 చిరునామాకు పంపాలి. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను sunshine.rise@nic.in అనే అధికారిక ఈమెయిల్ ఐడి ద్వారా సమర్పించవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు సమయం :: 02 మే 2026 & 0001 గం
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 31 మే 2026 & 2359 గం

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Office Website Click Here

