AP Polytechnic Hall Ticket Release 2026 | AP పాలిటెక్నిక్ హాల్ టికెట్లు రోజున ఉదయం 11:00 గంటల విడుదల
AP Polytechnic Hall Ticket Release 2026 today direct link : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు శుభవార్త.. రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి (SBTET), ఆంధ్రప్రదేశ్, మంగళగిరి కార్యదర్శి గారు తెలియజేయునదేమనగా, POLYCET-2026 హాల్ టికెట్లు 18-04-2026 ఉదయం 11:00 గంటల నుండి డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచబడతాయి.

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET)-2026 ను 25-04-2026 (శనివారం) రోజున ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.
అభ్యర్ధులు తమ హాల్ టికెట్లను క్రింది విధానాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
1. వాట్సాప్ గవర్నెన్స్ (Mana Mitra) అభ్యర్థులు 9552300009 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది విధంగా వెళ్లాలి. Education Services → POLYCET Entrance Hall Ticket తర్వాత క్రింది వివరాల్లో ఏదో ఒకటి నమోదు చేయాలి. SSC హాల్ టికెట్ నంబర్ & నమోదు చేసిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2. అధికారిక వెబ్సైట్: హాల్ టికెట్లు క్రింది వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు https://polycetap.ap.gov.in/ SSC హాల్ టికెట్ నంబర్ లేదా నమోదు చేసిన మొబైల్ నంబర్ నమోదు చేసి హాల్ టికెట్ పొందవచ్చు. అభ్యర్థులు ముందుగానే తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని, అందులో ఉన్న వివరాలను పరిశీలించుకోవాలని సూచించబడుతుంది. సరైన హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం కల్పించబడదు కాబట్టి, తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాలి. ఏవైనా సహాయం కోసం అభ్యర్థులు సంబంధిత సంస్థలలో ఏర్పాటు చేసిన హెల్ప్న్ కేంద్రాలను సంప్రదించవచ్చు.


