Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగ నోటిఫికేషన్ చేసింది
AP ICDS Anganwadi Recruitment 2026 : Apply Online for 108 Anganwadi Workers, Mini Anganwadi Workers & Anganwadi Ayas Posts
AP ICDS Anganwadi Recruitment 2026 : అభ్యర్థి తప్పని సరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను.. ఇటువంటి రాత పరీక్షలు లేకుండా.. ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల జిల్లా పరిధి లో 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ లలోని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలు నియమకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హత కలిగిన అభ్యర్థులు 23.04.2026 సాయంత్రము 5.00 గంటల లోపల అన్ని పని దినములలో ఆఫ్ లైన్ లో సమర్పించవలెను.

జిల్లా పరిధి లో 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ లలోని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలు నోటిఫికేషన్ వచ్చింది. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు 07 & అంగన్వాడీ ఆయాలు 101 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు వెంట అవసరమగు ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టేస్టేషన్ చేయవలెను) జతపరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు తేది 14.04.2026 నుండి తేది 23.04.2026 సాయంత్రము 5.00 గంటల లోపల అన్ని పని దినములలో సమర్పించవలెను. అభ్యర్దినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను.
పోస్ట్ వివరాలు
1. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు : 07
2. అంగన్వాడీ ఆయాలు : 101
అంగన్వాడీ కార్యకర్త (టీచర్) పోస్టునకు కావాల్సిన అర్హతలు:-
1. అభ్యర్థి తప్పని సరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను
2. అభ్యర్థినులు తేదీ 01.07.2025 నాటికి 21 వ సం. ల వయస్సు నిండి 35 సం. ల వయస్సు లోపు వారై ఉండవలెను
3. అభ్యర్దినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను
4. యస్. సి. యస్ టి జనవాస ప్రాంతాలలో అభ్యర్థినీల లో 21సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను
అంగన్వాడీ ఆయా పోస్టునకు కావాల్సిన అర్హతలు:-
1. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు ఎవరూ లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును.
2. అభ్యర్థినులు తేదీ 01.07.2025 నాటికి 21వ సం. ల వయస్సు నిండి 35 సం. ల వయస్సు లోపు వారై ఉండవలెను
3. అభ్యర్దినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను
4. యస్. సి. యస్ టి జనావాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను
జతపరచవలసిన ధృవ పత్రములు:-
1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము
2. కుల దృవీకరణ పత్రము (యస్సీ అభ్యర్దినులు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య: 7, తేది: 18.4.25 ప్రకారం వారి యొక్క కులం ఏ గ్రూప్ నకు వర్తిస్తుందో తెలియజేస్తున్న ధృవీకరణ పత్రం (లేటెస్ట్) ది జతపరచవలయును.
3. విద్యార్హత దృవీకరణ పత్రము యస్.యస్.సి మార్క్ లిస్ట్, టి. సి. మరియు యస్. యస్. సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి. సి. జతపరచవలయును.
4. నివాస స్థల దృవీకరణ పత్రము
5. వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము మరియు 18 సం. ల పిల్లలు ఉన్నచో, వారి యొక్క వయసు దృవీకరణ పత్రము.
6. వికలాంగులు అయినచో సదరన్ వారు జారీ చేసిన సర్టిఫికేట్.
7. ఆధారు కార్డ్ మరియు
8. రేషన్ కార్డు
•ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు వెంట అవసరమగు ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టేస్టేషన్ చేయవలెను) జతపరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు తేది 14.04.2026 నుండి తేది 23.04.2026 సాయంత్రము 5.00 గంటల లోపల అన్ని పని దినములలో సమర్పించవలెను. రూల్ అఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. వివరాలకు నంద్యాల జిల్లా వెబ్ సైట్ http://nandyal.ap.gov.in/ ను పరిశీలించగలరు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు జిల్లా వెబ్ సైట్ http://nandyal.ap.gov.in/ ను కానీ, రోస్టర్ వివరాలు మరియు ఇతర వివరాల కొరకు సంబందిత శిశు అభివృద్ధి పధక అధికారిణి గార్లను సంప్రదించగలరు.
ఈ నోటిఫికేషన్ ను ఏ సమయములో అయిన రద్దు చేయు అధికారం ఈ క్రింద సంతకము దారులకు కలదు.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

