తక్కువ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.33,750 జీతం | NPCC Recruitment 2026 Apply Now
NPCC Assistant Recruitment 2026: ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్‌తో పాటు ఫైనాన్స్, హెచ్ఆర్, లా, ఐటీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 31, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా సైట్ ఇంజినీర్ (సివిల్), సైట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), సీనియర్ అసోసియేట్ (ఫైనాన్స్), సీనియర్ అసోసియేట్ (హెచ్ఆర్), సీనియర్ అసోసియేట్ (లా), సీనియర్ అసోసియేట్ (ఐటీ), జూనియర్ ఇంజినీర్ (సివిల్), అసిస్టెంట్, అసిస్టెంట్ (ఫైనాన్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ జోన్లలో మొత్తం 52 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


NPCC Recruitment 2026 Overview
సంస్థ పేరు: నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCC)
ఉద్యోగాలు: సైట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్, సీనియర్ అసోసియేట్
విద్యార్హతలు: డిగ్రీ, బీకామ్, డిప్లొమా, బీఈ/బీటెక్, సంబంధిత పీజీ
జీతం: నెలకు ₹25,000 నుంచి ₹33,750 వరకు
అదనపు ప్రయోజనాలు: ₹1,250 మెడికల్ అలవెన్స్, కంపెనీ PF కాంట్రిబ్యూషన్
గరిష్ఠ వయస్సు: 40 సంవత్సరాలు (రిజర్వేషన్ ప్రకారం సడలింపు)
అనుభవం: సైట్ ఇంజినీర్ పోస్టులకు అవసరం లేదు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ లేదా సంస్థ నిర్ణయించే ఇతర విధానం
ఉద్యోగ కాలపరిమితి: మొదట ఒక సంవత్సరం కాంట్రాక్ట్
దరఖాస్తు ఫీజు: జనరల్/OBC ₹500; SC/ST/EWS/PwBD/మాజీ సైనికులకు ఉచితం
దరఖాస్తు ప్రారంభం: 15 అక్టోబర్ 2026
చివరి తేదీ: 31 అక్టోబర్ 2026
దరఖాస్తు విధానం: ఆన్లైన్
Apply Online: https://recruit-jobs.in/npcc
విద్యార్హత : సైట్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టుకు సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా అవసరం.
సీనియర్ అసోసియేట్ (ఫైనాన్స్) పోస్టుకు CA, CMA, MBA (ఫైనాన్స్) లేదా సంబంధిత పీజీ అర్హత ఉండాలి. హెచ్ఆర్ పోస్టుకు MBA (HR) లేదా హెచ్ఆర్లో పీజీ, లా పోస్టుకు మూడేళ్ల ఎల్ఎల్బీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ అవసరం. ఐటీ పోస్టుకు MCA లేదా కంప్యూటర్ సైన్స్/ఐటీలో బీటెక్ అర్హత ఉండాలి.
అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు కంప్యూటర్‌పై నిమిషానికి 50 పదాలు టైప్ చేయగలగాలి. అసిస్టెంట్ (ఫైనాన్స్) పోస్టుకు బీకామ్ పూర్తి చేసి ఉండాలి. అవసరమైన అన్ని విద్యార్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి రెగ్యులర్ కోర్సులో పూర్తి చేసి ఉండాలి.

జీతం ఎంత : సైట్ ఇంజినీర్, సీనియర్ అసోసియేట్ పోస్టులకు నెలకు రూ.33,750 చొప్పున కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చెల్లిస్తారు. జూనియర్ ఇంజినీర్ పోస్టుకు రూ.25,650, అసిస్టెంట్ పోస్టులకు రూ.25,000 చొప్పున జీతం ఉంటుంది. వీటితో పాటు నెలకు రూ.1,250 మెడికల్ అలవెన్స్, కంపెనీ తరఫున 12 శాతం ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో పనిచేసేవారికి 12.5 శాతం, బెంగళూరులో పోస్టింగ్ పొందేవారికి 5 శాతం అదనపు మొత్తాన్ని చెల్లించే నిబంధన ఉంది.
వయోపరిమితి : అన్ని పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది. అర్హులైన దివ్యాంగులు, మాజీ సైనికులకు కూడా నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. వయస్సు, విద్యార్హతలు తదితర అర్హతలను 30 సెప్టెంబర్ 2026 నాటికి పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక విధానం : అభ్యర్థుల ఎంపికను సంస్థ నిర్ణయించే విధానం ప్రకారం నిర్వహిస్తారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా ఇతర తగిన ఎంపిక విధానాన్ని అనుసరించవచ్చు. ఎంపికైన వారికి మొదట ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం కల్పిస్తారు. ప్రాజెక్టు అవసరాలు, పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్‌ను పొడిగించే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఫీజును ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ : 15 అక్టోబర్ 2026 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 అక్టోబర్ 2026 రాత్రి 11:59 గంటలు.
ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత ఉన్న అభ్యర్థులు NPCC అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులో విద్యార్హతలు, వయస్సు, ఇతర వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here

