AP Jobs : కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాల మరియు జనరల్ హాస్పిటల్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | AP GMC and GGH Notification 2025 Apply Now
AP GMC and GGH Recruitment 2025 Latest Library Assistant, Lab Attendant & Office Subordinate Job Notification 2025 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కేవలం టెన్త్ ఆపై చదివిన అభ్యర్థులకు బంపర్ నోటిఫికేషన్.. సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం వారి పరిధిలో గల ఆఫీస్ సబార్డినేట్స్, అనేస్తేషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండంట్స్, స్టోర్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, ఈసీజీ టెక్నీషియన్ & లైబ్రరీ అసిస్టెంట్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగుల కోసం కొత్త నియామకం విడుదల చేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తులు తేది 26 డిసెంబర్ 2025 ఉ. 10.00 గం. నుండి తేది :09 జనవరి 2026 సా.04.00 గం. వరకు ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల నందు వ్యక్తిగతంగా మాత్రమే సమర్పించవలెను.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ (HM & FW Department) డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం వారి పరిధిలో గల ఆఫీస్ సబార్డినేట్స్, అనేస్తేషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండంట్స్, స్టోర్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, ఈసీజీ టెక్నీషియన్ & లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కు చెందిన అభ్యర్థుల Dt:22.12.2025 మరియు దరఖాస్తు వివరములు తూర్పు గోదావరి జిల్లా వెబ్ సైట్ https://eastgodavari.ap.gov.in https://gmcrajamahendravaram.ap.gov.in/about.aspx పరచడమైనది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి.
AP GMC and GGH Library Assistant, Lab Attendant & Office Subordinate Job Recruitment 2025 Apply 60 Vacancy Overview :
సంస్థ పేరు :: రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) మరియు ప్రభుత్వ బోధనా జనరల్ హాస్పిటల్ (GTGH)లో జాబ్స్
పోస్ట్ పేరు :: ఆఫీస్ సబార్డినేట్స్, అనేస్తేషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండంట్స్, స్టోర్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, ఈసీజీ టెక్నీషియన్ & లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 60
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్
వయోపరిమితి :: 42 సంవత్సరాల
విద్య అర్హత :: 10th ఆపై చదివిన
నెల జీతం :: రూ.₹15,000/- to ₹34,600/-
దరఖాస్తు ప్రారంభం :: 26 డిసెంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 09 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ ::https://eastgodavari.ap.gov.in
»పోస్టుల వివరాలు:
1. ఆఫీస్ సబార్డినేట్స్
2. అనేస్తేషియా టెక్నీషియన్
3. కార్డియాలజీ టెక్నీషియన్
4. ల్యాబ్ టెక్నీషియన్
5. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్
6. జనరల్ డ్యూటీ అటెండంట్స్
7. స్టోర్ అటెండెంట్
8. ల్యాబ్ అటెండెంట్
9. ఈసీజీ టెక్నీషియన్
10. లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 60 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత:
1. ఆఫీస్ సబార్డినేట్స్ :: SSC లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
2. అనేస్తేషియా టెక్నీషియన్ :: సైన్స్ గ్రూపులతో ఇంటర్మీడియట్ మరియు 2 సంవత్సరాలు ఉండాలి. అనస్థీషియా టెక్నీషియన్‌లో డిప్లొమా. APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి.
3. కార్డియాలజీ టెక్నీషియన్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Sc డిగ్రీతో పాటు 2 సంవత్సరాల కార్డియాలజీ టెక్నీషియన్ డిప్లొమాతో పాటు 2 సంవత్సరాల డిప్లొమా. గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ (లేదా) గుర్తింపు పొందిన సంస్థ నుండి కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో బి.ఎస్సీ. APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి.
4. ల్యాబ్ టెక్నీషియన్ :: DMLT లేదా B. Sc (MLT) కలిగి ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో ఇంటర్మీడియట్ (VOC) చేసి ఉంటే APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థికి DMLT మరియు B. Sc MLT రెండూ ఉంటే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందిన గరిష్ట శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
5. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ :: మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ & ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి.
6. జనరల్ డ్యూటీ అటెండంట్స్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
7. స్టోర్ అటెండెంట్ :: 10th లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
8. ల్యాబ్ అటెండెంట్ :: SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ ఎడ్యుకేషన్ బోర్డు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా ఇతర సంస్థ నుండి నిర్వహించే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ ఒకేషనల్ కోర్సు) కలిగి ఉండాలి.
9. ఈసీజీ టెక్నీషియన్ :: ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి ECG టెక్నీషియన్ కోర్సులో డిప్లొమా కలిగి ఉండాలి. APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి.
10. లైబ్రరీ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి CLISC (లైబ్రరీ సైన్స్‌లో సర్టిఫికేట్) తో ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి.
»నెల జీతం : నోటిఫికేషన్ లో పోస్టులను అనుసరించి రూ ₹15,000/- to ₹34,600/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు.
»దరఖాస్తు రుసుము :: OC అభ్యర్థులు రూ.300/- (మూడు వందల రూపాయలు మాత్రమే) & BC/SC/ST/EWS/మాజీ సర్వీస్ అభ్యర్థులు/PWD (OC కాకుండా)రూ.200/- (రూపాయలు రెండు వందల యాభై మాత్రమే. దరఖాస్తుదారుడు ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, రాజమహేంద్రవరం పేరుతో దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కోసం డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి. (ఏదైనా అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అతను/ఆమె ప్రతి పోస్టుకు వేర్వేరు డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి మరియు ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ బోధనా జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం రెండింటికీ విడివిడిగా ప్రతి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.).
»ఎంపిక విధానం: అర్హత పరీక్షలో లేదా ఏదైనా ఇతర సమానమైన అర్హతలో అన్ని సంవత్సరాలలో పొందిన మార్కుల మొత్తానికి 75% కేటాయించబడుతుంది. 25% ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు తమ దరఖాస్తులు తేది 26,12.2025 ఉ. 10.00 గం. నుండి తేది :09.01.2026 సా.04.00 గం. వరకు ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం నందు వ్యక్తిగతంగా మాత్రమే సమర్పించవలెను. సూచించిన ఆఫ్‌లైన్ మోడ్ (ఫిజికల్ అప్లికేషన్) కాకుండా వేరే ఏ మోడ్ ద్వారా పంపిన ఏదైనా దరఖాస్తును ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ : 26.12.2025, 10:00 గంటలు
•ఆఫ్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 09.01.2026 సా.04.00 గం. వరకు

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here
🛑Application Pdf Click Here

