7th అర్హతతో AP జిల్లా మహిళా, శిశు సంక్షేమం కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా జాబ్ | AP DWCWEO Notification 2025 Apply Now
AP DWCWEO Recruitment 2025 Latest Store Keeper Cum Accountant & Night Watchman Notification Apply Online Now ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి కార్యాలయం లో స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మన్, ఎడ్యుకేటర్ & నైట్ వాచ్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 07, 2025 చివరి తేదీ.. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు చిల్డ్రన్ హోమ్ ఉన్న జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం & సాధికారత కార్యాలయం (DWCWEO) వివిధ విభాగాల్లో నియమించబడతారు.
ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 7th,10వ తరగతి ఉత్తీర్ణత/ఫెయిల్, కామర్స్/ఫైనాన్స్ (బి.కాం)లో బ్యాచిలర్ డిగ్రీ & గణితం మరియు సైన్స్‌లో B.Sc, B.Ed పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన వారు పోస్టులనుసరించి రూ.7944/- to రూ.18,536/ మధ్యలో జీతం ఇస్తారు. ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని ఆసక్తి గల మహిళా అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు..
5
ఖాళీల వివరాలు..
స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ పోస్టుకు 01, కుక్ పోస్టుకు 01, హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మన్ పోస్టుకు 01, ఎడ్యుకేటర్ పోస్టుకు 01 & నైట్ వాచ్ మెన్ పోస్టుకు 01 ఉన్నాయి.
వయో పరిమితి..
అభ్యర్థుల 01.07.2025 నాటికి 25-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపులు ఉన్నాయి. SC/ST/BC/EBC దరఖాస్తుదారులకు 5 సంవత్సరాల ఉన్నత వయస్సు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం..
విద్య అర్హత మెరిట్ ఆధారంగా అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
జీతం..
స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ పోస్టుకు రూ.18,536/-, కుక్ పోస్టుకు రూ.9,930/-, హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మన్ పోస్టుకు రూ.7,944/-, ఎడ్యుకేటర్ పోస్టుకు రూ.15,000/- & నైట్ వాచ్ మెన్ పోస్టుకు రూ.7,944/- జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము.. లేదు.
దరఖాస్తు ప్రక్రియ :
అభ్యర్థులు సూచించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు నింపిన దరఖాస్తును విద్యా అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో పాటు 28.11.2025 నుండి 7.12.2025 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు DWCWEO మహిళా ప్రగణం కాంపౌండ్ బొమ్మూరు E.G. జిల్లాకు పంపవచ్చు/సమర్పించవచ్చు. గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణించబడవు.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: నవంబర్ 28, 2025 నుండి
•ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ:: డిసెంబర్ 07, 2025 వరకు

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

