7th అర్హతతో జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖలో సోషల్ వర్కర్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ | AP DCPU Social Worker & Ayah Contract Basis Job Notification 2025 Apply Offline Now
AP DCPU Social Worker & Ayah Contract Basis Job Recruitment 2025 : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, విశాఖపట్నం జిల్లా “మిషన్ వాత్సల్య” పధకము నందు సోషల్ వర్కర్ & ఆయా ఖాళీగా వున్న ఈ దిగువ తెలిపిన పోష్టులకు కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేయుటకు గాను అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న సోషల్ వర్కర్ & ఆయా అయితే ఉన్నాయి. కేవలం 7వ తరగతి & గ్రాడ్యుయేట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 01.07.2025 నాటికి 25 సంవత్సరములు నిండి 42 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. అప్లై ఆఫ్ లైన్ లో చూసుకోవాలి.

ఈ పోస్టులపై నియామకాలు జరుగుతాయి:
ఈ నియామక ప్రక్రియ ద్వారా సోషల్ వర్కర్ & ఆయా ఉద్యోగాలు మొత్తం 02 జాబ్స్ భర్తీ చేస్తారు.
వయోపరిమితి: 01.07.2025 నాటికి 25 సంవత్సరములు నిండి 42 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
అర్హతలు:
అయా (మహిళలు) : ఏ స్త్రీ అయినా 7వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
సోషల్ వర్కర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్/సోషియోలజీ/సోషల్ సైన్సెస్‌లో బి.ఎ గ్రాడ్యుయేట్ ఉండాలి.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
జీతం: సోషల్ వర్కర్ పోస్టుకు రూ. 18,536/-& ఆయా పోస్టుకు నెలకు రూ.7,944/-మాత్రమే జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం :
ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిస్టిక్ వెబ్సైట్ ద్వారా htpp://visakhapatnam.ap.gov.in) నుండి దరఖాస్తు (CV) డౌన్ లోడ్ చేసుకొని వివరములు పూర్చి చేసి అన్నీ దృవ పత్రాలు నఖలు జత ఏదైనా గజెటెడ్ అధికారిచే అట్టేస్తేషన్ చేయించి తేది:03.10.2025 నుండి 14.10.2025 లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 05.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం, రెండవ అంతస్తు, సంక్షేమ భవన్, సెక్టార్-9, MVP కాలనీ, విశాఖపట్నం పిన్ కోడ్- 530017 వారికి సమర్పించవలెను. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
ఈ నోటిఫికేషన్ ఏటువంటి కారణములు తెలపకుండానే ఏ సమయములో నైన రద్దు చేయుటకు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ చైర్మన్ విశాఖపట్నం వారికి అధికారం కలదు.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభం: 03 అక్టోబర్ 2025
• దరఖాస్తుకు చివరి తేదీ: 14 అక్టోబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here