ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | EMRS Teaching & Non Teaching Recruitment 2025 Notification Out for 7267 Vacancies all details in Telugu
EMRS Teaching & Non-Teaching Job Recruitment 2025 in Telugu Apply Now : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో నాన్ టీచింగ్ పోస్టుకు నియామకం కోసం 7267 పోస్టులు కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో ల్యాబ్ అటెండెంట్, క్లర్క్ (JSA), అకౌంటెంట్, మహిళా స్టాఫ్ నర్సు, హాస్టల్ వార్డెన్, టీజీటీ, పిజిటి & ప్రిన్సిపాల్ 7267 పోస్టుకు తో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. 23.10.2025 నాటికి 18-50 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రారంభ జీతం రూ. ₹18,000-209200/- వేతన స్కేల్ ఇస్తారు. అభ్యర్థులు EMRS వెబ్‌సైట్ https://nests.tribal.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ విండో 19/09/2025 నుండి 23/10/2025 వరకు రాత్రి 11:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 19 సెప్టెంబర్ 2025
*దరఖాస్తు చివరి తేదీ = 23 అక్టోబర్ 2025
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడిన స్వయంప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS), ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్లు, హాస్టల్ వార్డెన్ (పురుష మరియు స్త్రీ), మహిళా స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) మరియు ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు ప్రత్యక్ష ప్రాతిపదికన నియామకం కోసం అర్హత మరియు ఆసక్తిగల భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) అర్హత, దరఖాస్తు లింక్, వయస్సు, ఫీజు, పరీక్షా విధానం ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ల్యాబ్ అటెండెంట్, క్లర్క్ (JSA), అకౌంటెంట్, మహిళా స్టాఫ్ నర్సు, హాస్టల్ వార్డెన్, టీజీటీ, పిజిటి & ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 50 Yrs
మొత్తం పోస్ట్ :: 7267
అర్హత :: 10th, 12th, Any డిగ్రీ, B. Sc నర్సింగ్, బి.ఎడ్. + సిటిఇటి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
నెల జీతం :: రూ.₹.18,000-209200/- /-
దరఖాస్తు ప్రారంభం :: సెప్టెంబర్ 19, 2025
దరఖాస్తుచివరి తేదీ :: అక్టోబర్ 23, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://nests.tribal.gov.in/
»పోస్టుల వివరాలు: ఏకలవ్య విద్యా సంస్థలలో కింద విధంగా పోస్టులు అయితే ఉన్నాయి.

•ప్రిన్సిపాల్ : 225
•PGTS : 1460
•TGTS : 3962
•మహిళా స్టాఫ్ నర్స్ : 550
•హాస్టల్ వార్డెన్ : 635
•అకౌంటెంట్ : 61
•జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) : 228
•ల్యాబ్ అటెండెంట్ : 146
మొత్తం = 7267 ఉద్యోగాలు ఉన్నాయి.

»అర్హత:
•ల్యాబ్ అటెండెంట్ : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి లాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికెట్/డిప్లొమాతో పాటు 10వ తరగతి ఉత్తీర్ణత. లేదా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి.
•జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) : గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (క్లాస్ XII) సర్టిఫికేట్ మరియు ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి.
•అకౌంటెంట్ : ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ. గమనిక: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ అర్హత లేదు.
•మహిళా స్టాఫ్ నర్సు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి నర్సింగ్‌లో బి.ఎస్.సి. (ఆనర్స్). లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి బి.ఎస్.సి. నర్సింగ్‌లో రెగ్యులర్ కోర్సు.
•హాస్టల్ వార్డెన్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
•టీజీటీ : సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ + బి.ఎడ్. + సిటిఇటి అర్హత.
•పిజిటి : ప్రతి పోస్ట్‌పై క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం సంబంధిత సబ్జెక్టులో NCTE గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు, B.Ed. భాగంతో సహా కనీసం 50% మార్కులతో. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మాస్టర్స్) డిగ్రీ*
•ప్రిన్సిపాల్ : 8-12 సంవత్సరాల అనుభవంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ + బి.ఎడ్.





»వయోపరిమితి: 23.10.25 నాటికి ప్రిన్సిపాల్ : 50 సంవత్సరాల, PGT : 40 సంవత్సరాల, TGT : 35 సంవత్సరాల & అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్ & JSA: 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»వేతనం: నెలవారీ గౌరవ వేతనం ప్రారంభ జీతం రూ.18,000-209200/- నెల జీతం ఇస్తారు.
•ప్రిన్సిపాల్ : రూ.78800-209200/-
•PGTS : రూ.47600-151100/-
•TGTS : రూ.44900-142400/-
•మహిళా స్టాఫ్ నర్స్ : రూ.29200-92300/-
•హాస్టల్ వార్డెన్ : రూ.29200-92300/-
•అకౌంటెంట్ : రూ. 35400-112400/-
•జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) : రూ. 19900-63200/-
•ల్యాబ్ అటెండెంట్ : రూ.18000/- to ₹56900/-

»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు 500/- నుంచి 2500/- మధ్యలో ఉంటుంది పోస్టులు అనుసరించి చెల్లించవలసి ఉంటుంది.

»ఎంపిక విధానం: కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష (CPT)తో, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు EMRS అధికారిక వెబ్‌సైట్ emrs.tribal.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 19.09.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 23.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here