Free Training : గ్రామీణ నిరుద్యోగ యువతీ.. ఉచిత శిక్షణ, భోజనం, హాస్టల్ వసతితో పాటు..ఆపైన ఉద్యోగం పక్క
DDUGKY Swamy Ramananda Tirtha Rural Institute Free training All Details in Telugu : పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ – తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ-యువకులకు ఉచిత శిక్షణ -హస్టల్ – భోజన వసతి తో పాటు ఉద్యోగం కల్పించబడును.
భారత ప్రభుత్వంమరియు తెలంగాణ ప్రభుత్వం ద్వార నిర్వహింపబడే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన – (DDUGKY) ఉపాధి అధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వనించడమైనది.

కోర్స్, కాలవ్యవధి & అర్హత వివరాలు
1. ఎకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ) = కాల పరిమితి 3 1/2 నెలలు – అర్హత : బి.కామ్ పాస్
2. కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ = కాల పరిమితి : 3 1/2 నెలలు – అర్హత : ఇంటర్మీడియట్ పాస్
3. ఆటోమొబైల్ – 2 వీలర్ సర్వీసింగ్ = కాల పరిమితి : 3 1/2 నెలలు – అర్హత : పదవ తరగతి పాస్
4. సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మరియు సర్వీస్ = కాల పరిమితి : 3 1/2 నెలలు – అర్హత : వదవ తరగతి పాస్/ ఐటిఐ ఉన్న వారికి ప్రాధన్యత కల్పించబడును.
ఇతర అర్హతలు:
1. వయస్సు 18-30 సంవత్సరముల మధ్య ఉండాలి.
2. గ్రామీణ అభ్యర్థులై ఉండాలి.
3. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు.
కావలసిన పత్రాలు:
1. అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సెట్
2. పాస్పోర్ట్ ఫోటో
3. ఆధార్ కార్డు
4. రేషన్ కార్డు
చిరునామా : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్ (గ్రా), పోచంపల్లి (మం) యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణా – 508 284 హైదరాబాద్- దిల్సుఖ్ నగర్ నుండి 524 నంబర్ బస్ సౌకర్యం కలదు.
సమీప రైల్వే స్టేషన్లు: బీబి నగర్, భువనగిరి, సికింద్రాబాద్
అడ్మిషన్లకు చివరి తేది: 01.09.2025 (సొమవారం) మరిన్ని వివరాల కోసం : 9133908000, 9133908111, 9133908222, 9948466111.

🛑Full Details Click Here