10+2 అర్హతతో AP గ్రామ వార్డు సచివాలయంలో 2511 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh Grama Ward Sachivalayam 3rd Notification Upcoming Vacancy List : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగుల కోసం భర్తీ చేయాలని సీఎం గారు ఆదేశించారు. ప్రస్తుతం 2,511 ఉద్యోగుల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం చంద్రబాబు గారు.
ఈ నోటిఫికేషన్ లో ఇందులో 1,711 జూనియర్ లైన్మన్, 800 ఏఈఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా ఏపీఎస్పీడీసీఎల్లో 2,850, ఏపీసీపీ డీసీఎల్లో 1,708, ఏపీఈపీడీసీఎల్లో 2,584.. మొత్తంగా 7,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ జెన్కో, ట్రాన్స్కోల్లోనూ మరికొన్ని ఉన్నాయి.
అలాగే ఉద్యోగులపై అధిక భారం పడకుండా ఉండాలని మంత్రి గొట్టిపాటి, సీఎస్ విజయానంద్ అభిప్రాయంతో సీఎం చంద్రబాబు ఏకీభవించారు. ముందస్తుగా ఏఈఈ, జేఎల్ఎం పోస్టులను అవసరమైన మేరకు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏఈఈ, జేఎల్ఎం పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ లభించింది.

🛑Notification Pdf Click Here