RTC Jobs : త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
TGSRTC Latest Job Notification Update In Telugu : TGSRTCలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉద్యోగార్థులను కొందరు మోసం చేస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుంది.
అడ్డదారుల్లో ఎవరికి కూడా ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్యోగార్థులకు యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.
ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా మిమ్మల్న సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సంస్థ సూచిస్తోంది.
