AP గ్రామ, వార్డు సచివాలయాలలో ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా జాబ్ పొందండి | Latest Anganwadi Teacher & Helper district wise Job Notification 2025 August In Telugu
Latest Anganwadi Teacher & Helper Notification 2025 : ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 12 ప్రాజెక్ట్ పరిధిలోని కేవలం 10వ తరగతి అర్హతతో 28 అంగన్వాడీ టీచర్, 168 అంగన్వాడీ హెల్పర్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల ఆగష్టు 5 నుంచి ఆగష్టు 26వ తేదీ సాయంత్రం 5 లోగా అభ్యర్థులు తమ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో అర్హులైన మహిళా అభ్యర్థి నుంచి వెంటనే దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణులై, జూలై 2025 నాటికి 21 సంవత్సరాలు నిండి, 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. వివాహిత మహిళ అయిఉండాలని, అవివాహితులు అనర్హులని తెలిపారు. అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రోస్టర్ ప్రకారం ఎంపిక చేస్తారు.
ఆయా ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఏ కులం సంబంధించిన వాళ్ళు ఆ కులానికి అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్స్లోని పోస్టులకు ఆయా సామాజికవర్గాలు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లోని పోస్టులకు 10వ తరగతి పాసైన వారు లేని పక్షంలో ఆ తదుపరి తరుగతుల వారు అర్హులన్నారు.

జతపరచవలసిన ధృవ పత్రములు:-
1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము (10th మార్క్ షీట్ ఉంటే చాలు)
2. కుల దృవీకరణ పత్రము (SC, ST & OBC) అభ్యర్థులైనట్లయితే
3. 10th విద్యార్హత దృవీకరణ పత్రము
4. నివాస స్థల ధృవీకరణ పత్రము
5. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రము
6. వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్
7. ఆథారు కార్డ్ మరియు
8. రేషన్ కార్డు
ఆయా ఖాళీల వివరాలను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ నోటీసు బోర్డుల్లో ప్రచురించడం జరుగుతుందన్నారు. సీడీపీఓలు పత్రిక ప్రకటనల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. ఈ నోటిఫికేషన్ లో నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ రావడం జరిగింది.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here