ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు

ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ASHA Worker Notification 2025 latest district wise job notification in Telugu : అనంతపురము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, కమ్యూనిటీ ప్రొసెస్, నేషనల్ హెల్త్ మిషన్, NIIM, పధరంలో భాగంగా అనంతపురము జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో 58 మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది, అర్హులైన వారు తేది. 25,06,2025 నుండి 30.06.2025 వరకు (29.06.2025 ఆదివారం శలవు) ఖాళీగా ఉన్న సచివాలయములలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారణీ డా.E.B.దేవిగారు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఆశా కార్యకర్తల నియానుకం గ్రామీణ/ పట్టణ ఆరోగ్య పారిశుధ్య పౌష్టికాహార కమిటీ (VHSNC/UHSNC) ద్వారా వచ్చిన దరఖాస్తుల నుండి ప్రతిభ కలిగిన 3 ఆప్లికేషన్లు జిల్లా ఆఫీసుకు పంపవలెను, వచ్చిన అప్లికేషన్లు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారి ద్వారా నియామకాలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి డా.E.B.దేవిగారు గారు తెలియజేయడం జరిగింది.

అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు:

తప్పనిసరిగా మహిళా అభ్యర్థి. సంబంధిత గ్రామ / వార్డులో నివసిస్తూ, 25 సంవత్సరముల నుండి 45 సంవత్సరముల వయసు కలిగి, వివాహితై ఉండాలి.

వితంతువులు,విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయియిన లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.

10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

తెలుగు బాగా చదవటం, రాయటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యము వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకి వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగివుండాలి.

దరఖాస్తు తో పాటు అందజేయవలసిన ధ్రువపత్రములు:

నివాస ధృవీకరణపత్రము (తహసీల్దారు ద్వారా జారీచేయబడిన నివాస దృవీకరణపత్రము / రేషన్ కార్డు/బి పి.యల్ కార్డు/ఓటరు కార్డు / ఆధార్ కార్డు /బ్యాంకు పాస్ పుస్తకము)

10 వ తరగతి సర్టిఫికెట్ కాపీ.

వైవాహిక స్థితి: వితంతువు/ విడాకులు పొందిన / భర్త నుండి విడిపోయిన/ నిరాశ్రయురాలు అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించి స్వంత డిక్లరేషన్.

నోటిఫికేషన్ కోసం షెడ్యూల్

1. నోటిఫికేషన్ తేదీ : 23.06.2025

2. దరఖాస్తు అందిన తేదీ : 25.06.2025 నుండి 30.06.2025 వరకు 29.06.2025 (ఆదివారం సెలవు)

3. దరఖాస్తుల పరిశీలన : 01.07.2025 నుండి 02.06.2025 వరకు

4. తాత్కాలిక జాబితాను ప్రచురించడం : 03.07.2025

5. తాత్కాలిక జాబితాపై అభ్యంతరాలు : 04.07.2025

6. తుది మెరిట్ జాబితా ప్రచురణ : 05.07.2025

గమనిక: తుది మెరిట్ జాబితా మరియు అన్ని దరఖాస్తులు DM & HO కార్యాలయంలో, అనంతపురంలో సమర్పించాలి. తేదీ: 07.07.2025.

సూచన: పై నియామకమునకు సంబంధించిన ఖాళీలు / అర్హత నిబంధనలలో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసే అధికారము డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారికి కలదని తెలియపరచటమైనది.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *