New Ration Card : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
New Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ కార్డుల జారీ కోసం కొత్త ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, పౌర సరఫరాల శాఖ బుధవారం నుండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.
కొత్త రేషన్ కార్డులకు అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సచివాలయాల్లో ఏడురకాల రేషన్ కార్డు (కొత్త రైస్ కార్డు దరఖాస్తు, కుటుంబ సభ్యుల చేర్పు, కార్డు విభజన, సభ్యుల తొలగింపు, కార్డు అప్పగింపు, చిరునామా మార్పు & తప్పుగా లింకైన ఆధార్ సీడింగ్ సవరణ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులు కూడా చేసుకోవచ్చు.
గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవచ్చు. జిల్లా కేంద్రాల్లోని JC కార్యాలయాలు కూడా ఈ సేవలపై దృష్టి సారిస్తున్నాయి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ లో అందరూ కూడా తెలియజేయండి.