AP లో ఉచిత ఇంటి స్థలం అర్హులు ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి | AP Housing for All Details Scheme 2025

AP లో ఉచిత ఇంటి స్థలం అర్హులు ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి | AP Housing for All Details Scheme 2025

AP Housing Schemes : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందరికీ హౌసింగ్ అనే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం కింద ఇంటి స్థలం పట్టా పంపిణీకి మార్గదర్శకాలు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. రెవెన్యూ శాఖ G.O.MS.No. 23 ని ఈ రోజు 27వ తేదీన విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందరికీ హౌసింగ్” పథకం ద్వారా ఇల్లు లేని పేద ప్రజలకు భూమిని ఉచితంగా అందజేయడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలలో ఒకటి. నిరాశ్రయులైన BPL కుటుంబాలకు ఇది అద్భుతమైన అవకాశం. ఆసక్తి గల అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

AP గృహ స్థల పట్టాల పథకం ముఖ్యాంశాలు

• గ్రామీణ ప్రాంతాలు:3 సెంట్లు (0.03 ఎకరాలు)
• పట్టణ ప్రాంతాలు:2 సెంట్లు (0.02 ఎకరాలు)

ఉచితంగా ఇంటి స్థలం అర్హతలు: బీదరిక రేఖ (BPL) కిందకు వచ్చే కుటుంబాలకు మాత్రమే ఉచిత స్థలం లభిస్తుంది. ఇల్లు లేదా స్థలం లేని వారే అర్హులు. గతంలో ప్రభుత్వ హౌసింగ్ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నవారు అర్హులు కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అవకాశం. మహిళల ప్రాధాన్యత: కేటాయించిన స్థలం మహిళా కుటుంబ ప్రధానికి రిజిస్టర్ చేయబడుతుంది. కేటాయించిన భూమిలో 2 ఏళ్లలోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. 10 సంవత్సరాల పాటు ఆ స్థలాన్ని అమ్ముకోవడానికి అనుమతి లేదు.

ఇంటి స్థలం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దరఖాస్తు విధానం:
• ఆన్‌లైన్: అధికారిక వెబ్‌సైట్ housing.ap.gov.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
• ఆఫ్‌లైన్: గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.

కావలసిన పత్రాలు: ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం & భూమి లేదని రాబందీ ధృవీకరణ తదితర పత్రాలు మీ దగ్గర ఉండాలి.

ముఖ్యమైన తేదీలు
• ఉత్తర్వులు విడుదల: 27-01-2025
• దరఖాస్తు ప్రారంభం: అధికారిక ప్రకటన విడుదలైన వెంటనే
• చివరి తేది: ఇంకా ప్రకటించలేదు

🔥Official Website Click Here

ముఖ్యమైన ప్రశ్నలు & సమాధానాలు
1. పథకం కింద స్థలం పొందడానికి ఎవరెవరు అర్హులు?
• ఇల్లు లేదా స్థలం లేని, తెల్ల రేషన్ కార్డు కలిగిన BPL కుటుంబాలు మాత్రమే అర్హులు.

2. భూమి పంపిణీ మహిళల పేరుమీద మాత్రమేనా?
• అవును, ప్రతి కుటుంబంలో మహిళా ప్రదానికి మాత్రమే భూమి రిజిస్ట్రేషన్ చేయబడుతుంది.

3. కేటాయించిన స్థలాన్ని అమ్ముకోవచ్చా?
• లేదు, 10 ఏళ్లపాటు అమ్ముకోవడానికి అనుమతి లేదు.

4. దరఖాస్తు ఎక్కడ చేయాలి?
• ఆన్‌లైన్‌లో housing.ap.gov.in లేదా గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయవచ్చు.

5. గృహ నిర్మాణం చేయడానికి సమయం ఎంత ఉంటుంది?
• భూమి కేటాయించిన 2 ఏళ్లలోపు గృహ నిర్మాణం పూర్తిచేయాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

<p>You cannot copy content of this page</p>