KGBV Admission 2025 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం
KGBV Admission 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (KGBV) ప్రవేశాలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరం కోసం దరఖాస్తు ప్రక్రియ మార్చి 22, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన బాలికలు ఏప్రిల్ 11, 2025 వరకు ఆన్లైన్ https://apkgbv.apcfss.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
KGBV విద్యాలయాలు అనాథలు, బడి బయట పిల్లలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు బీపీఎల్ బాలికలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 352 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యాలయాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాబ్యాసాన్ని అందిస్తాయి. ప్రతి విద్యార్థికి ఉచిత విద్యతో పాటు గురుకుల వాతావరణం, భోజనం, వసతి, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, ఆరోగ్య సంరక్షణ వంటి సదుపాయాలు అందిస్తారు.
🔥Gold Silver Rates Today : బంగారు వెండి ధరలు గణనీయంగా మార్పులు

ప్రవేశాలు కల్పించే తరగతులు:
• 6వ తరగతి
• ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్
• 7, 8, 9, 10 తరగతులలో ఖాళీ ఉన్న సీట్లకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
దరఖాస్తు విధానం:
• అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
• అధికారిక వెబ్‌సైట్ apkgbv.apcfss.in ద్వారా అప్లై చేయవచ్చు.
• దరఖాస్తు ప్రక్రియ మార్చి 22, 2025 నుంచి ఏప్రిల్ 11, 2025 వరకు కొనసాగుతుంది.
అర్హతలు & ఆర్థిక పరిమితి
అర్హత గల బాలికలు:
• అనాథలు
• బడి మానేసిన పిల్లలు (డ్రాప్‌ఔట్ విద్యార్థులు)
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు
• గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల బాలికలు
పేరెంట్స్ వార్షిక ఆదాయ పరిమితి:
• గ్రామీణ ప్రాంతాల్లో: రూ. 1.20 లక్షలు కంటే ఎక్కువ కాకూడదు.
• పట్టణ ప్రాంతాల్లో: రూ. 1.40 లక్షలు మించరాదు.
దరఖాస్తు చేయాల్సిన విధానం
• apkgbv.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
• “ప్రవేశాల కోసం దరఖాస్తు” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
అవసరమైన డాక్యుమెంట్లు
దరఖాస్తుతో పాటు కింది డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
• విద్యార్థి జనన సర్టిఫికెట్
• విద్యార్హతకు సంబంధించిన ధృవపత్రాలు
• ఆధార్ కార్డు
• తల్లిదండ్రుల ఆదాయ ధృవపత్రం
• కుల ధృవపత్రం (ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ విద్యార్థులకు)
• నివాస ధృవపత్రం
• పాస్‌పోర్ట్ సైజు ఫోటో
🔥Traffic Police Rules : ప్రజలు కొత్త ట్రాఫిక్ రూల్స్..నిబంధనలు పాటించకపోతే 25,000/- జరిమానా తప్పదు
ఎంపిక విధానం
• అందిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత, అర్హత కలిగిన విద్యార్థులకు SMS ద్వారా సమాచారం అందజేస్తారు.
• ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లయితే, ప్రాధాన్యత గల పిల్లలను ఎంపిక చేస్తారు.
• ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత, విద్యార్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
ప్రవేశానికి ముఖ్యమైన తేదీలు
ఘటనతేదీదరఖాస్తు ప్రారంభంమార్చి 22, 2025దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 11, 2025ఎంపిక ఫలితాల ప్రకటనఏప్రిల్ చివరి వారంలోక్లాసులు ప్రారంభంజూన్ 2025

🛑Online Registration Click Here
🔥Jio, Airtel, BSNL, VI SIM మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఎన్ని రోజుల్లో యాక్టివ్ లో ఉంటుంది మీకు తెలుసా