10th అర్హతతో ఇండియా పోస్ట్ GDS కొత్త నోటిఫికేషన్ | India Post GDS Recruitment 2025 | Telugu Jobs Point
India Post GDS Recruitment 2025 in Telugu : ఫ్రెండ్స్ పోస్టల్ శాఖలో 21413 సొంత గ్రామంలో ఉద్యోగం పొందాలని అభ్యర్థులకి శుభవార్త. పోస్టల్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) ఉద్యోగులకు కోసం India Post GDS Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 21413 ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10 ఫిబ్రవరి 2025 తేదీ నుంచి 03 మార్చ్ 2025 మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్లు విద్య అర్హత ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. కేవలం 10వ తరగతి పాస్ చాలు, ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా సొంత గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. నెల జీతం, విద్య అర్హత, వయసు, పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే అప్లై చేసుకోండి.
విద్య అర్హత : పోస్టల్ డిపార్ట్మెంట్ GDS ఉద్యోగుల కోసం కేవలం 10వ తరగతి పాస్ అంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలుగు భాష బాగా వచ్చి ఉండాలి, మరియు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
పోస్ట్ పేరు : బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ ఫీజు ₹100/- ఉంటుంది.
వయోపరిమితి : 03.03.2025 నాటికి వయసు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి.
నెల జీతం : బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ ఉద్యోగం కోసం నెలకు జీతం రూ. 12000 – రూ. 29380/- & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగుల కోసం రూ. 10000 – రూ. 24470/- మధ్యలో నెలకు జీతం ఇస్తారు.
పోస్టల్ GDS ఉద్యోగులకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు :
• 10వ తరగతి పాస్ సర్టిఫికెట్
• ఆధార్ కార్డు
• పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
• నివాస ధృవీకరణ పత్రం
• కుల ధృవీకరణ పత్రం (SC, ST & OBC)
• తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో
• సిగ్నేచర్ చేసిన ఫోటో
దరఖాస్తు విధానం : ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ GDS ఉద్యోగుల కోసం ఎంపిక పూర్తిగా విద్య అర్హత మెరిట్ ఆధారంగా ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ 10/02/2025
అప్లికేషన్ చివరి తేదీ 03/03/2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here