ఆగస్టు 15న మూడు స్కీములు అమలులోకి వస్తున్నాయి | Andhra Pradesh free bus scheme Thalliki Vandanam Anna canteen latest update in Telugu
Latest Scheme in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న అభ్యర్థులకు శుభవార్త, స్పీడ్ పెంచిన కూటమి ప్రభుత్వం, మూడు హామీలకు అమలకు అడుగులు ముందుకు, ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు, రోడ్డు ఎక్కుతున్న మహిళలకు ఉచిత బస్సు, ప్రారంభ దిశగా తల్లికి వందనం, ఆరోగ్యానికి అండగా హెల్త్ ఇన్సూరెన్స్ సీఎం చంద్రబాబు ఒకేసారి మూడు శుభవార్తలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒకేసారి మూడు పథకాలు అమలులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ కూడా అమలు చేస్తామని తెలియజేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ యాక్టింగ్ తొలగింపు అలా వన్ బై వన్ అనేది చేసుకుంటూ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన మూడు పథకాల ప్రారంభించినట్లు ప్రకటించడం జరిగింది. అందులో మొదటిది మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. రెండో పథకం తల్లి వందనం పథకం ఇవ్వడం జరుగుతుంది మూడో పథకం అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు :- ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలకమైన హామీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఆగస్టు 15న ప్రారంభించేందుకు చేస్తున్నారు. ఈ ఉచిత బస్సు ద్వారా RTC కి వచ్చే నష్టం ప్రభుత్వం భరిస్తుందని తెలియజేయడం జరిగింది. ఆధార్ కార్డు ఆధారంగా రాష్ట్రంలో ఉన్న మహిళ అందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చక చక ఏర్పాట్లు సాగిపోతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం పనితీరు పరిశీలించిన అధికారులు సాంకేతిక అక్కడ ఇబ్బందులు మరియు సాంకేతిక నిర్వహణ భారం తదితర అంశాలపై అవగాహనకు వచ్చారు. అక్కడ కన్నా మెరుగ్గా ఇక్కడ ఉచిత బస్సు సౌకర్యం ఏర్పరిచే విధంగా అన్ని సన్నాద్దాలు చేస్తున్నారు. తప్పనిసరిగా ఆధార్ కార్డు లేనట్లయితే ఆధార్ కార్డు తీసుకోండి.
అన్న క్యాంటీన్ :- ఈసారి అన్న క్యాంటీన్ కొనసాగించడంలో ప్రజలు మరియు అన్నదాతల నుంచి కూడా సహాయం తీసుకో విధంగా సన్నహాలు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ వల్ల నిరుపేదలైనటువంటి వాళ్ళు కేవలం ఐదు రూపాయలు కడుపునిండా అన్నం తినే విధంగా ఉంటుంది. పెళ్లిరోజు, పుట్టినరోజులు అలా ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు కూడా అన్న క్యాంటీన్లో భోజనం అందించే విధంగా కూడా చేస్తున్నారు. ఈసారి మరింత మంచి భోజనం కల్పించే విధంగా అన్న క్యాంటీన్ అయితే తయారైనది అవుతున్నాయి.
తల్లికి వందనం :- స్కూలుకి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి 15 వేల రూపాయలు తల్లికి వందనం కింద అదే కాకుండా ప్రతి మహిళలకు కూడా 1500 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరు కూడా ఇస్తామని మీకు ఎలాంటి ఇందులో డౌట్ లేదనేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. తప్పుడు సమాచారాన్ని ఎవరు కూడా నమ్మకండి. దీనివల్ల సంవత్సరానికి 18000 వస్తుంది. ఈ ఐదు సంవత్సరంలో 90 వేల రూపాయలు వరకు ఒక పథకం ద్వారా లబ్ధి అనేది మీరు పొందవచ్చును.
ఇలా ప్రజలకు ఉపయోగపడే మూడు పథకాలు ఒకేసారి ఆగస్టు 15వ తేదీన మనకు విడుదల చేస్తామనేసి ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.