New Postal Scheme  | Mahila Samman Savings Certificate Scheme 2023 in Telugu 

New Postal Scheme  | Mahila Samman Savings Certificate Scheme 2023 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mahila Samman Savings Certificate Scheme 2023, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ మహిళల కోసం కొత్త పోస్టాఫీసు పథకం భారతప్రభుత్వం- తపాలా శాఖమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్-2023. మహిళలు మరియు ఆడపిల్లలు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పొదుపు పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది దీని సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కింద ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఆర్టికల్ చదవండి. అందరు కూడా షేర్ చేయండి.

Mahila Samman Savings Certificate Scheme 2023 : పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు

*మహిళలు మరియు మైనర్ ఆడపిల్లలపేరు మీద సంరక్షకులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. వయస్సుతో నిమిత్తం లేదు.

*కనిష్ఠంగా రూ. 1000/- తో మరియు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఖాతాను తెరవచ్చు. గరిష్ట పరిమితి 2 లక్షలలోపు ఎన్ని ఖాతాలైన తెరవచ్చు. ముందు ఉన్న ఖాతాకు, మరో ఖాతా తెరవడానికి మధ్య 3 నెలలు వ్యవది ఉండాలి.

*ఖాతా కాల వ్యవధి 2 సంవత్సరాలు.

*అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది 7.5 % వడ్డీ. త్రైమాసిక ప్రాతిపదికన కలిపి ఖాతాలో జమ

*ఈ కొత్త పథకం 01.04.2023 నుండి 31.03.2025 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది.

*జమ అయున మొత్తంలో ఒక సంవత్సరం తరువాత నుండి 40% వరకు పాక్షికంగా ఉపసంహరణ చేసుకొనే సౌకర్యం కలదు

*అత్యవసర పరిస్థితులలో ఖాతాను ముందుగానే మూసివేయచ్చు.

*పైన పేర్కోన్న కారణాలు వల్ల కాకుండా ఖాతా తెరిచిన తేదీ నుండి 6 నెలలు పూర్తయిన తర్వాత 5.5% వడ్డీతో

ఖాతాను ఎప్పుడైన ముగించు కొనవచ్చు.

తక్కువ పెట్టుబడి తక్కువ కాలం -ఎక్కువ రాబడి

Mahila Samman Savings Certificate SchemeMSSC 7.5% వడ్డీ రేటు 
జమ చేసిన మొత్తంరెండు సంవత్సరాలకు లభించు వడ్డీ ఫలితం
1,000/-1601,160
10,000/-1,60211,602
50,000/-8,01158,011
1,00,000/-16,0221,16,022
2,00,000/-32,0442,32,044

కావలసిన పత్రాలు:

*3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు

*ఆధార్ కార్డ్

*పాన్ కార్డ్ (పాన్ కార్డ్ లేనిచో ఫార్మ 60 సమర్పించవచ్చును. ఫార్మ 60 పోస్టాఫీస్ నందు లభించును.

*మీ దగ్గరలోని హెడ్ పోస్టాఫీసు/ సబ్ పోస్టాఫీసు/ బ్రాంచ్ పోస్టాఫీసు లలో ఎక్కడైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page