Anganwadi Recruitment September 2022 Notification Apply Online Latest Job In Telugu

Anganwadi Recruitment September 2022 Notification Apply Online Latest Job In Telugu

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సత్యవేడు : తిరుపతి జిల్లా సత్యవేడు మహిళా – శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త -1 , 12 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని సత్యవేడు ఐసీడీఎస్ అధికారిణి దేవ కుమారి కోరారు . నాగలపురం మండలం సురుటు పల్లె అంగన్వాడీ కేంద్రం టీచర్ పోస్టు (ఎస్టీ – జనర ల్) కేటగిరీకి కేటాయించారు. అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులు : సత్యవేడు మండ లంలోని ఇరుగుళం (ఎస్టీ – జనరల్), రాజపాళెం (బీ సీ – జనరల్), సత్యవేడు -4 లో (ఎస్సీ – జనరల్), ఆర్సీ పురం ( ఎస్సీజనరల్ ) . వరదయ్యపాళెం మండలం లక్ష్మీపురం 2 (బీసీ ఈ), లక్ష్మీపురం -1 (పీహెచ్), కడూరు (బీసీ – ఏ), వెంగరెడ్డి కండ్రిగ (ఎస్టీ – జనరల్). నాగలాపురం మండలం జానికాపురం (బీసీడి), సురుటుపల్లె (ఎస్టీ), బయటి కొడిబేడు 2 (బీసీ – సి), ఎస్ఎస్ పురం 1 లో (పీహెచ్సీ మహిళ) కు రిజర్వు చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 8 వ తేదీ లోపు దరఖాస్తులు సత్యవేడులోని తమ కార్యాలయంలో ఇవ్వాలని సీడీపీఓ తెలిపారు.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు పుత్తూరు రూరల్ : పుత్తూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టు లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ పద్మజ తెలిపారు. మంగళవారం ఆమె మహిళలు మాట్లాడుతూ అంగన్వాడీ పోస్టుకు 10 వ తరగతి ఉత్తీర్ణులైన, స్థానిక వివాహిత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వెల్లడిం చారు . 7 వ తరగతి ఉత్తీర్ణులైన, స్థానిక మహిళలు మినీ అంగన్వాడీ, హెల్పర్ పోస్టులకు అర్హులని వివరించారు l. అభ్యర్థులు 21 నుంచి 35 ఏళ్ల లోపువారై ఉండాలని సూచించారు.

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు   

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

>తప్పనిసరిగా 7వ, 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

>జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 01/09/2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

>అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.

>అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.

>నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.

>ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.

>ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.

>ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.

>వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.

>అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

>కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.

Important Posts.

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️SSC Stenographer C Stenographer D Recruitment 2022 Online apply in Telugu

➡️Deshbandhu College Recruitment 2022 in Telugu Non Teaching 40 Post Apply Online

➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2022-23).

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here

➡️More Anganwadi job information click here

➡️ Anganwadi Supervisor Video click here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *