ఏపీలో రిలయన్స్ రూ.43 వేల కోట్ల బొగ్గు గ్యాస్ ప్లాంట్ – ఏలూరు జిల్లాలో కొత్త ప్రాజెక్ట్

ఏపీలో రిలయన్స్ రూ.43 వేల కోట్ల బొగ్గు గ్యాస్ ప్లాంట్ – ఏలూరు జిల్లాలో కొత్త ప్రాజెక్ట్

AP Reliance Coal Gas Plant Eluru Chintalapudi : ఏలూరు జిల్లా చింతలపూడి దగ్గర రిలయన్స్ రూ.43 వేల కోట్లతో భూగర్భ బొగ్గును గ్యాస్‌గా మార్చే ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఉద్యోగాలు, పెట్టుబడుల వివరాలు ఇక్కడ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి రాబోతోంది. ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలో భూగర్భంలో ఉన్న బొగ్గును గ్యాస్‌గా మార్చే ప్లాంట్‌ను రూ.43 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు కూడా రావచ్చు. అంచనా ప్రకారం రూ.2.7 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రావచ్చని అంటున్నారు. ఉద్యోగాల పరంగా చూస్తే దాదాపు 5 వేల మందికి నేరుగా ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా మరో 35 వేల మందికి పని దొరుకుతుంది.

ప్రాజెక్ట్‌ను రెండు దశల్లో చేపడతారు. మొదటి దశలో బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడం, భూగర్భ అధ్యయనాలు చేయడం, అవసరమైన ప్రయోగాలు నిర్వహించడం జరుగుతుంది. రెండో దశలో అసలు ప్లాంట్ నిర్మాణం మొదలవుతుంది.

ఈ ప్రాజెక్ట్ ఏలూరు జిల్లాకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. స్థానికులకు ఉపాధి, ప్రాంత అభివృద్ధి రెండూ దీని ద్వారా జరగవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *