తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 121 ఉద్యోగాలు.. స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు | Telangana DMHO Recruitment 2026
Telangana DMHO Recruitment 2026 Staff Nurse, Pharmacist, Supporting Staff Posts : తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం (DMHO) వివిధ విభాగాల్లో మొత్తం 121 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతను బట్టి 10వ తరగతి నుంచి MBBS, నర్సింగ్, ఫార్మసీ, పీజీ వరకు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 23 నుంచి 28, 2026 వరకు ఉంటుంది.

Telangana DMHO Recruitment 2026 Overview
| వివరాలు | సమాచారం |
| సంస్థ | మేడ్చల్–మల్కాజిగిరి DMHO |
| మొత్తం ఖాళీలు | 121 |
| ఉద్యోగాలు | స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు |
| ఉద్యోగ విధానం | కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్ |
| విద్యార్హతలు | 10వ తరగతి నుంచి సంబంధిత డిగ్రీ, పీజీ వరకు |
| దరఖాస్తు ప్రారంభం | 23-10-2026 |
| చివరి తేదీ | 28-10-2026 |
| దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
పోస్టుల వారీగా ఖాళీలు : నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం మెడికల్ ఆఫీసర్ పోస్టులు 17, స్టాఫ్ నర్స్ పోస్టులు 50, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు 9, MLHP/CHO/MO పోస్టులు 13, డిస్ట్రిక్ట్ ఎపిడెమియాలజిస్ట్ పోస్టు 1, ANM పోస్టులు 8, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 16, ఫార్మసిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. వీటితో పాటు పబ్లిక్ హెల్త్ మేనేజర్, PPM/ACSM కో-ఆర్డినేటర్, TD-మినీహబ్ మేనేజర్ పోస్టులు ఒక్కొక్కటి ఉన్నాయి.
విద్యార్హతలు ఏమి ఉండాలి?
మెడికల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన సంస్థ నుంచి MBBS పూర్తి చేసి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
స్టాఫ్ నర్స్ : B.Sc నర్సింగ్, GNM, M.Sc నర్సింగ్ లేదా నోటిఫికేషన్లో పేర్కొన్న సంబంధిత నర్సింగ్ అర్హతతో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
MLHP/CHO/MO: నిర్దిష్ట అర్హతలకు అనుగుణంగా MBBS, BAMS లేదా B.Sc నర్సింగ్ పూర్తి చేసి సంబంధిత కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ : ఇంటర్మీడియట్‌తో పాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో నిర్దేశించిన డిప్లొమా లేదా సర్టిఫికెట్ అర్హత ఉండాలి.
ఫార్మసిస్ట్ : B.Pharmacy లేదా D.Pharmacy పూర్తి చేసి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
సపోర్టింగ్ స్టాఫ్ : పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


డిస్ట్రిక్ట్ ఎపిడెమియాలజిస్ట్, పబ్లిక్ హెల్త్ మేనేజర్, PPM/ACSM కో-ఆర్డినేటర్, TD-మినీహబ్ మేనేజర్ పోస్టులకు సంబంధిత డిగ్రీ, పీజీ, అనుభవం వంటి ప్రత్యేక అర్హతలు అవసరం. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
వయోపరిమితి : మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 18 నుంచి 46 సంవత్సరాలు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోసడలింపు నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
ఎంపిక విధానం : అభ్యర్థుల ఎంపికలో సంబంధిత విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులకు గరిష్ఠంగా 90 మార్కుల వెయిటేజీ, వయస్సు ఆధారంగా గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజీ కేటాయిస్తారు. అయితే పోస్టును బట్టి ఎంపిక ప్రమాణాలు మారే అవకాశం ఉన్నందున అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా చదవాలి.
దరఖాస్తు ఎలా చేయాలి : ముందుగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి సంబంధిత నోటిఫికేషన్, దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://medchal-malkajgiri.telangana.gov.in/
చివరి తేదీ అక్టోబర్ 28, 2026. అర్హత ఉన్న అభ్యర్థులు గడువు ముగియకముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

