ఇంటర్ (10+2) అర్హతతో 1,688 రైల్వే ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే | RRB NTPC Recruitment 2026 Apply Now

ఇంటర్ (10+2) అర్హతతో 1,688 రైల్వే ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే | RRB NTPC Recruitment 2026 Apply Now

Railway RRB NTPC 10+2 Under Graduate Recruitment 2026 Apply Online for 1688 Post : రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ (10+2) అర్హతతో పోస్టుల భర్తీకి CEN నెం. 07/2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామకం ద్వారా మొత్తం 1,688 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, ఫీజు వివరాలను తెలుసుకుని సిద్ధం కావాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 15, 2026 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 13, 2026 రాత్రి 11:59 గంటల వరకు ఉంది. ఫీజు చెల్లింపునకు నవంబర్ 15 వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తులో మార్పులు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నవంబర్ 16 నుంచి 25, 2026 వరకు సవరణల గడువును వినియోగించుకోవచ్చు. అయితే, ఖాతా సృష్టించే సమయంలో ఇచ్చిన వివరాలు, ఎంపిక చేసిన RRBను మార్చడం సాధ్యం కాదు.

RRB NTPC Recruitment 2026 Overview

సంస్థ: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)
నోటిఫికేషన్ నంబర్: CEN 07/2026
మొత్తం ఖాళీలు: 1,688
అర్హత: ఇంటర్మీడియట్ / 12వ తరగతి
వయస్సు: 18–30 సంవత్సరాలు (01-01-2027 నాటికి, వర్తించే సడలింపులతో)
ప్రారంభ జీతం: రూ.19,900 నుంచి రూ.21,700
దరఖాస్తు ప్రారంభం: 15-10-2026
చివరి తేదీ: 13-11-2026
అధికారిక వెబ్‌సైట్: https://rrb.indianrailways.gov.in

మొత్తం 1,688 పోస్టులు.. ఏ ఉద్యోగాలు ఉన్నాయి

ఈ రైల్వే నియామకంలో నాలుగు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.

•కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ : 700

•అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 200

•జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 600

•ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 188 ఉన్నాయి.

•అన్ని పోస్టులు కలిపి మొత్తం ఖాళీల సంఖ్య 1,688.

విద్యార్హతలు : ఈ పోస్టులకు ప్రధానంగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. సాధారణంగా మొత్తం మార్కుల్లో కనీసం 50 శాతం మార్కులు అవసరం. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఇంటర్మీడియట్ కంటే ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఈ మార్కుల నిబంధన వర్తించకపోవచ్చు.

వయోపరిమితి :  2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

•ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు
•ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది.
•దివ్యాంగులు, మాజీ సైనికులు, ఇతర అర్హతగల ప్రత్యేక కేటగిరీలకు కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నెల జీతం :ఈ ఉద్యోగాల్లో పోస్టును బట్టి ప్రారంభ నెలవారీ ప్రాథమిక వేతనం ఉంటుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుకు రూ.₹21,700/- to ₹69,100/- చెల్లిస్తారు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు రూ.₹19,900/- to ₹63,200/- ప్రారంభ ప్రాథమిక వేతనం ఉంటుంది. వీటికి వర్తించే ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు రైల్వే నిబంధనల ప్రకారం ఉంటాయి.

దరఖాస్తు రుసుము : సాధారణంగా ఇతర కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన తర్వాత, వర్తించే బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన అర్హులైన అభ్యర్థులకు ఫీజు రూ.250. మొదటి దశ CBTకి హాజరైతే వర్తించే బ్యాంకు ఛార్జీలు మినహాయించి ఫీజు తిరిగి చెల్లిస్తారు. ఫీజు రాయితీకి అవసరమైన ధ్రువపత్రాలు నోటిఫికేషన్ ప్రకారం సమర్పించాలి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థుల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT), అవసరమైన పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పోస్టును బట్టి టైపింగ్ నైపుణ్య పరీక్ష కూడా ఉండవచ్చు. పూర్తి ఎంపిక విధానం, పరీక్షల వివరాలు, పోస్టుల వారీగా అర్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ https://rrb.indianrailways.gov.in ను సందర్శించాలి. అక్కడ CEN నెం. 07/2026 నోటిఫికేషన్‌ను తెరిచి అర్హతలు, ఖాళీలు, నిబంధనలను పూర్తిగా చదవాలి. అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ద్వారా ఖాతాను సృష్టించి, అవసరమైన వివరాలను నమోదు చేసి, ఫోటో, సంతకం, అవసరమైన ధ్రువపత్రాలను సూచించిన విధంగా సమర్పించాలి. నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తును పూర్తి చేయాలి.

ఖాతా సృష్టించే సమయంలో ఉపయోగించే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ చెల్లుబాటులో ఉండాలి. ఈ వివరాలను తర్వాత మార్చడం సాధ్యం కాదని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు
•దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 అక్టోబర్ 2026

•దరఖాస్తుకు చివరి తేదీ : 13 నవంబర్ 2026

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *