ఏపీలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ అర్హత APPSC Jobs 2026 Apply Now

ఏపీలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ అర్హత APPSC Jobs 2026 Apply Now

APPSC Assistant Welfare Officer Recruitment 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 29, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Recruitment 2026 పోస్టుల వివరాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ సర్వీసులో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 11 ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసులో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 6 ఉన్నాయి.

విద్యార్హతలు : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇతర అర్హతలు, నిబంధనలను పూర్తి నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

వయోపరిమితి : 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 44 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది. మాజీ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

జీతం ఎంత : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 వేతన స్కేల్ వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాలు వర్తించే అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం : ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBRT) విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ తర్వాత ప్రకటిస్తుంది. పరీక్షకు సంబంధించిన పూర్తి విధానం, సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్‌లోని అనుబంధం-IIను పరిశీలించాలి.

దరఖాస్తు ఫీజు :అభ్యర్థులు రూ.250 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతల ప్రకారం కొన్ని వర్గాలకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఫీజు మినహాయింపులు, రిజర్వేషన్ నిబంధనలు భిన్నంగా ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

•ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09 అక్టోబర్ 2026.

•దరఖాస్తులకు చివరి తేదీ: 29 అక్టోబర్ 2026, రాత్రి 11:59 గంటల వరకు.

ఎలా దరఖాస్తు చేయాలి :  మొదట ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ను సందర్శించాలి. ఇప్పటికే OTPR రిజిస్ట్రేషన్ ఉన్నవారు తమ వివరాలతో లాగిన్ కావాలి. కొత్త అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) పూర్తి చేయాలి. అనంతరం నోటిఫికేషన్ నంబర్ 26/2026ను ఎంచుకుని, దరఖాస్తులో అడిగిన వివరాలను నమోదు చేయాలి. అవసరమైన ఫీజు చెల్లించి, దరఖాస్తును సమర్పించాలి. చివరగా అప్లికేషన్ కాపీని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన సూచన : దరఖాస్తు చేసే ముందు విద్యార్హతలు, వయస్సు, ఫీజు, రిజర్వేషన్ నిబంధనలు, పరీక్ష సిలబస్ వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా తనిఖీ చేయండి.

అధికారిక వెబ్‌సైట్ : https://psc.ap.gov.in

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *